ఏపి కొత్త సిఎం గా ఆశోక గజపతి రాజు?

ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయబోతున్నారా?  ఏపి సిఎం గా అశోక్ గజపతి రాజుకు అవకాశం దక్కనుందా? అవుననే అంటున్నాయి తెలుగుదేశం అత్యున్నత వర్గాలు.  చార్జిషీటులో తన పేరు ఉండే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా వేగంగా పావులు కదుపుతున్నారు.

అశోకగజపతిరాజుకు అవకాశమివ్వాలన్న ప్రతిపాదనను ఆయన దాదాపు ఖరారు చేసేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ అనుబంధ చార్జిషీట్‌లో తన పేరు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

ap new cm ashoka gajapati raju

 

అశోక గజపతి రాజు ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అనుబంధ చార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమవుతోంది. ఫోరెన్సిక్ విభాగం నుంచి నివేదిక అందగానే బహుశా మంగళవారం చార్జిషీటు దాఖలయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజులుగా డీజీపీ జేవీ రాముడు, రాష్ర్ట నిఘా విభాగ అధిపతి, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణపై వేగంగా పావులు కదుపుతున్నారు.

ap new cm ashoka gajapati raju

 

అశోక గజపతి రాజును ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇప్పటికే చంద్రబాబు తెలియజేశారని తెలుగుదేశం పార్టీ ఉన్నతస్థాయి వర్గాలంటున్నాయి. బావమరిది నందమూరి బాలకృష్ణ, సీనియర్ మంత్రులు కె.నారాయణ, యనమల రామకృష్ణల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ అశోక గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం. ఆయన చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడే కాక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పేరుంది. అనుబంధ చార్జిషీటులో చంద్రబాబు నాయుడి పేరుతో పాటు పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు టీడీపీ ఎంపీల పేర్లు ఉండే అవకాశాలున్నాయని సమాచారం.

CLICK: CHANDRABABU NAIDU

SOURCE: Mumbai Mirror.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top