2000 వేల నోటుపై ప్రింటింగ్ మిస్టేక్ ఉందా?

పాత 500/- 1000/- నోట్ల తర్వాత కొత్తగా మార్కెట్ లోకి రంగప్రవేశం చేసిన 2000/- నోట్ లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అని చాలా మంది నెటీజన్లు… నోట్ లో మిస్టేక్ ఉన్న ప్రాంతాన్ని రౌండప్ చేసి ట్విట్టర్ , వాట్సాప్ , ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.  వారు ఆరోపిస్తున్న మిస్టేక్ ఏంటంటే….ఏ నోట్ పై అయినా 15 భాషల్లో ఆ నోటు విలువను తెలిపేలా రాస్తారు. సేమ్ 2000/- నోట్ పై కూడా అలాగే రాశారు. కానీ  ఈ నోట్ పై ఓ సారి ” దోన్ హజార్ రుపియా” అని, ఓ సారి “దోన్ హాజార్ రుపయె” అని రాసి  ఉంది. వాస్తవానికి రెండు వేల రూపాయాలను హిందీలో  “దో హజార్ రుపియే” అనాలి. అలా కాకుండా..దోన్ హాజార్ రుపియే అని తప్పుగా రాశారని,అది కూడా రెండు సార్లు రాశారని చాలా మంది ఆరోపిస్తున్నారు.

printing_error_in_curreny

అయితే ఇదే ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు కొందరు నెటీజన్లు, దీనికి వారు చెబుతున్న సమాధానం ఏంటంటే…..దోన్ హాజార్ రుపియా అనేది ఒకటి కొంకణీ లాంగ్వేజ్ ది, మరో దోన్ హాజార్ రుపియే అనేది మరాఠి లాంగ్వేజ్ ది, హిందీ జాతీయ భాష కాబట్టి దానిని సెపరేట్ గా దో హజార్ రుపియే అని  రాశారు అనేది వారిచ్చిన సమాధానం. అలా అయితే భారత రాజ్యాంగం గుర్తించిన 24 భాషాల్లో కూడా ఆ నోట్ విలువను తెలిపేలా రాయొచ్చుగా అనేది ఇంకో ప్రశ్న…. రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలకు లిపి లేదుగా అనేది ఆన్సర్.

error_in_2000_note_5_1478

ఫైనల్ గా చెప్పేదేంటంటే….2000/- నోట్ పై  ఎటువంటి ప్రిటింగ్ మిస్టేక్ లేదు.

Comments

comments

Share this post

scroll to top