పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క ఇంతకీ వరుడు ఎవరో తెలుసా..?

బాహుబలి, భాగమతి తర్వాత అందాల తార అనుష్క శెట్టి క్రేజ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ రెండు సినిమాల తర్వాత సినిమాల వేగాన్ని కాస్త తగ్గించారు స్వీటి. బాహుబలి, భాగమతి బ్లాక్ బస్టర్ల తర్వాత సినిమాలు చేయకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పెళ్లి కారణంగానే సినిమాలను ఒప్పుకోవడం లేదనే రూమర్ ప్రచారంలో ఉంది. అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథనం ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌లో వచ్చింది.

ఈ ఏడాది చివర్లో

అనుష్క శెట్టి పెళ్లి ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఆమె తల్లిదండ్రులు ఆ ప్రయత్నంలో ఉన్నారు. అనుష్క పెళ్లికి ముందు అనేక ఆలయాలను సందర్శించుకొంటూ పూజలు జరుపుతున్నారని కథనంలో పేర్కొన్నారు.

హిమాలయాలకు అనుష్క శెట్టి

ఇటీవల అనుష్క హిమాలయాల పర్యటనకు వెళ్లారు. అక్కడ కొందరు అభిమానులను ఆమె గుర్తించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తమ కూతురు బాగోగుల కోసం అనుష్క తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారనే కథనం ఆ సందర్భంగా ప్రచురితమైంది.

వరుడి కోసం వేట

తమ కూతురు పెళ్లి కోసం చాలా మంది పెళ్లి కోడుకుల ప్రొఫైల్స్‌ను అనుష్క తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆమెకు తగిన వరుడు దొరికినట్టు అనిపిస్తే ప్రపోజల్ ముందుకెళ్లే అవకాశం ఉంది. దాదాపు అనుష్క పెళ్లి ఈ ఏడాది చివరికల్లా జరుగవచ్చు అని ఆంగ్ల వెబ్‌సైట్ పేర్కొన్నది.

ప్రభాస్‌తో రిలేషన్ వార్తలు

అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల కాలంలో మీడియాలో రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై పెద్దగా స్పందించలేదు. వారి మధ్య అలాంటి రిలేషన్ లేదని అనుష్క, ప్రభాస్ సన్నిహితులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Comments

comments

Share this post

scroll to top