జూ. ఎన్టీఆర్ కి నో చెప్పిన అనుష్క, RRR లో లేనట్టే..!!

రాజమౌళి, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పైన జనాల్లో భారీ హైప్ ఏర్పడింది, తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డ్స్ అధిగమించే సినిమా ఇదే అవుతుందని అందరూ భావిస్తున్నారు, ఎందుకంటే మెగా ఫ్యామిలీ వారసుడు, నందమూరి ఫ్యామిలి వారసుడు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటం. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో దేశవ్యాప్తంగా ఈ సినిమా పైన క్రేజ్ ఏర్పడింది.

అనుష్క నటించట్లేదు.. :

రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా బట్ ని ఫిక్స్ చేసారని సమాచారం, మరి జూ.ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఎవరనే ప్రశ్న కు స్వీటీ, ఎన్టీఆర్ సరసన నటించనుంది అనే పుకార్లు కొన్ని రోజులుగా ఎక్కువయ్యాయి ఫిలిం నగర్ లో. రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు, బాహుబలి తరువాత అనుష్క కి కూడా భారీ క్రేజ్ వచ్చింది దేశవ్యాప్తంగా. దీంతో ఎన్టీఆర్ సరసన అనుష్క నటించడం ఖాయం అనుకున్నారు అంత. కానీ అనుష్క RRR మూవీ లో నటించడానికి నో చెప్పిందని ప్రస్తుతం ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్న వార్త.

లాంగ్ షెడ్యూల్.. :

రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కలిసి RRR లాంగ్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననున్నారు, సినిమాని 2020 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి ఆలోచన, మరి ఎన్టీఆర్ సరసన RRR లో ఎవరు నటిస్తారు అనే విషయం ఇంకా ఫైనల్ కాకపోడం తో అసలు ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ కి స్కోప్ ఉందొ లేదో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయం పైన రాజమౌళి స్పందన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కథ ఇదేనా… :

ఒకరోజు బాక్సర్స్ మీద సినిమా ఉంటుందని ఒకరంటే, అన్న తమ్ముళ్ల మధ్య కథ అని ఇంకొకరు అంటారు, ఇలా RRR సినిమా పైన రోజుకో పుకారు షికారు చేస్తూనే ఉంది. సినిమా టీజర్ లేదా ట్రైలర్ వచ్చే వరకు సినిమా కథ అది ఇది అని పుకార్లు రావడం సహజమే.

Comments

comments

Share this post

scroll to top