అనుష్క …తడబడి, తప్పు చేసింది.

బాలీవుడ్  నటి అనుష్క శర్మ తడబడింది. సెలెబ్రెటీ అయి ఉండి కూడా నిర్లక్ష్యంగా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసి నెటీజన్ల కోపానికి గురయ్యింది. నిన్న రాత్రి కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కు ట్విట్టర్ లో నివాళులర్పించాలని భావించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క పెద్ద పోరపాటు చేసింది . అందరూ ట్వీట్ చేస్తున్నారు నేనెందుకో చేయకూడదు అనుకుంటో ఏమో….Abj kalam Azad  Rip  అంటూ ట్వీట్ చేసింది.

ఏపీజే అబ్దుల్ కలాం అనే పేరుకు  బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు తప్పుగా రాసి ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని వాటిని తొలగించి అభాసుపాలు అయ్యింది . ఏపీజే అబ్దుల్ కలాం పేరు కి బదులుగా ”ఏబీజే కలాం ఆజాద్ ” అని ఒకసారి ”ఏపీజే కలాం ఆజాద్ ” అని మరోసారి ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది అనుష్క శర్మ .

anushka sharma

 

దేశం గర్వించతగ్గ మహా నాయకుడు అయిన ఏపీజే అబ్దుల్ కలాం పేరు అనుష్క కు తెలియకపోవడం మరీ విచిత్రం పోనీ తెలియకపోయినప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . కానీ అనుష్క ఆ పని చేయకుండా తొందరపడి ట్వీట్ చేసింది. సెలెబ్రీటీలు ఏదైనా ఒక పోస్ట్ చేస్తే ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top