మంత్రిగారి ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఓ మహిళా DSP ని రెండు రోజుల్లో రెండు చోట్లకి ట్రాన్సఫర్ చేసారు.!

‘పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్ ఐతే పోలీస్ స్టేషన్ కే వెళతాడు పోస్టాఫీసుకు  కాదు’ ఈ డైలాగ్ ఓ పాపులర్ సినిమాలోనిది. ఇలాంటి ట్రాన్స్ ఫర్స్ ఎక్కువగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న వాళ్ళలోనే మనం చూస్తుంటాం. ఇక్కడా అలాంటి పరిస్థితే. మంత్రి ఫోన్ కాల్ కు ఆన్సర్ ఇవ్వలేదని ఓ ఆఫీసర్ ను రెండు రోజులలో రెండు చోట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోగల కుడ్లిగిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు అనుపమ. ఆమె డ్యూటీలో బిజీగా ఉంది. అంతలోనే ఆమె ఫోన్ కు అనోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది.  డ్యూటీ హడావుడిలో లిప్ట్ చేయలేదు. ఆ ఫోన్ వచ్చింది మంత్రిగారి నుండి. తన ఫోన్ నే లిఫ్ట్ చేయదా..? అంటూ కోపంతో ఊగిపోయారు మంత్రిగారు.  కట్ చేస్తే….. రెండు రోజుల్లో రెండు చోట్లకు  ట్రాన్స్ ఫర్ అయ్యారు అనుపమ.!

LadyDSP_Web-750x500

గతంలో అశోక్ ఖేమ్కా అనే ఐఏఎస్ అధికారి తన 23 ఏళ్ళ సర్వీస్ లో మొత్తం 45 సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ అక్రమ తవ్వకాలు, ఇసుక మాఫియాకు అడ్డుతగులుతోందని దుర్గశక్తి నాగ్ పాల్ అనే ఐఏఎస్ అధికారిని గౌతమ్ బుద్ధ నగర్ నుండి ట్రాన్స్ ఫర్ చేశారు.
ashok_khemka-480
కారణాలు, విమర్శలు:
భారతదేశంలో ఉన్నతస్థానంలో ప్రజలకు సేవలందిస్తున్న అధికారులు ఇలా ఎప్పటికప్పుడు ఒక శాఖనుండి మరోశాఖకు బదిలీ అవుతున్న విషయాన్ని పరిశీలిస్తూ 2012లో జరిగిన హాంకాంగ్ పొలిటికల్ మరియు ఎకనమిక్ రిస్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ లో 12 ఆసియా దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశంలో ‘ఉద్యోగులకు నాయకులు పీడకల’లాంటి వారని తెలిపారు. ఈ ఒక్కమాట చాలు మనదేశంలో ప్రభుత్వ అధికారులు  రాజకీయ నాయకులనుండి ఎన్ని సమస్యలను ఎదుర్కుంటున్నారో. అధికారులు సక్రమంగా ఉన్నా అవినీతి రాజకీయనాయకుల వలన దేశం ఇలా ఉందన్న నిజం అందరికీ తెలిసిందే.అయితే అటువంటి రాజకీయ నాయకులకు తలొగ్గి అధికారులు కూడా వాళ్లతో చేతులు కలపాల్సి వస్తోంది.

Comments

comments

Share this post

scroll to top