మిస్టరీ: ఫోన్‌కాల్‌పై అనుమానం..! ప్రజ్ఞ ఆత్మహత్యకు కారణం అదేనా.?

కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కవలసిన యువతి ఆత్మహత్య  చేసుకున్న ఘటనపై ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడితో గడిపిన ఆమెకు ఓ ఫోన్‌ రావడం, దానిపై అతడు ఆమెను అనుమానించడంతో ఇద్దరి మధ్య జరిగిన వివాదం ప్రియురాలి ప్రాణాల మీదకు వచ్చింది అని తెలుస్తుంది..

నిజామాబాద్ లోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన ప్రజ్ఞ వివాహం వచ్చేనెల 6న జరగా ల్సి ఉంది.  కుటుంబ సభ్యులు పెళ్లి పనులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు ప్రజ్ఞ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.తమ కూతురు పెళ్లి చేసుకుని,తన వైవాహిక  జీవితం బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు,ప్రజ్ణ చెల్లెలు మొదటి శుభలేఖను వేంకటేశ్వరుడి పాదాల వద్ద పెట్టేందుకు తల్లిదండ్రులు తిరుపతికి వెళ్లారు. ప్రజ్ణను ఒక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లారు.వాళ్లు అటు వెళ్లగానే కూతురు ఆత్మహత్య చేసుకుందనే వార్త వారికి అందింది..అయితే ఈ ఘటనకు సంభందించిన ఎటువంటి వివరాలు తెలియలేదు..ప్రజ్ణ చనిపోయిన రూంలో కేక్,పండ్లు,పూలు ఉండడంతో పాటు ప్రజ్ణ మెడలో పసుపుతాడు ఉండడంతో..పోలిసులు ప్రజ్ణకు ప్రేమ వ్యవహరం ఉందా అనే దిశలో విచారణ చేయగా..అసలు నిజాలు బయటికి వచ్చాయి.

బీటెక్, ఎంబీఏ చదివిన ప్రజ్ఞకు హైదరాబాద్‌లో నవీన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ప్రజ్ఞతో ప్రేమలో ఉండగానే నవీన్‌కు మరొకరితో వివాహమైంది. అయినా ప్రజ్ఞ అతడిని మరవలేదు. అతడికి పెళ్లి అయినా అతనే కావాలని కో రుకుంది.పెళ్లి కుదిరిన తర్వాత దైవదర్శనం కోసం కుటుంబం వెళ్లడంతో..ఇంట్లో ఎవరూ లేరని ప్రజ్ఞ తన ప్రియుడు నవీన్‌ను నిజామాబాద్‌కు రావాలని చెప్పటంతో అత ను వచ్చాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, గదిలో అప్పటికప్పుడు పసుపు కొమ్ముతో తాళి సిద్ధం చేసి అతడితో మెడలో కట్టించుకుంది. అనంతరం ప్రజ్ఞకు ఓ స్నేహితురాలు ఫోన్‌ చేసింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే ఆమెను పూర్తి పేరుతో కాకుండా నిక్‌ నేమ్ తో పలకరించింది. ఫోన్‌ మాట్లాడాక నవీన్‌ ‘ఎవరూ ఫోన్‌ చేసిందని’ అని అడిగాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు అని చెప్పింది. మరి మగ పేరుతో ఎందుకు పిలిచావని నవీన్‌ మరోసారి ప్రజ్ఞను అడగటంతో ఇద్దరి మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. దాంతో నవీన్‌ హైదరాబాద్‌ వెళ్తాను అంటూ బయటకు వచ్చాడు. అతడి వెనుకే ఆమె కూడా వచ్చి నువ్వు తిరిగి రాకపోతే చనిపోతానంటూ చెప్పింది. అతను నీ ఇష్టం అనడంతో ఆమె కోపంతో తిరిగి ఇంటికి వచ్చి చున్నితో ఉరేసుకుంది. కాస్సేపటి కి నవీన్‌ ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఇంటికి వెళ్లి కిటికీ నుంచి చూడగా బెడ్‌పై పడి ఉండటంతో అతను వెంటనే ప్రజ్ఞ చెల్లెలు కు ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపాడు.

రెండు రోజులైనా ఇంట్లో నుండి ప్రజ్ణ బైటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి చూడగా..శవంగా పడిఉన్న ప్రజ్ణను చూసి పోలిసులకు కంప్లైంట్ ఇచ్చారు..పోలీసులు వచ్చి ప్రజ్ణకు ప్రేమ వ్యవహారం ఉందా అనే దిశలో దర్యాప్తు జరిపి కేసుని ఛేదించి నవీన్ ని అరెస్ట్ చేశారు..దాంతో జరిగినదంతా చెప్పాడు.

Comments

comments

Share this post

scroll to top