ఈవ్ టీజ‌ర్ల ప‌ని ప‌ట్టేందుకు యూపీలో ఏర్పాటైన పోలీసు బృందం ఏంటో తెలుసా..?

షీ టీమ్స్ గురించి తెలుసు క‌దా..! తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక టీం అది. ఆక‌తాయిలు, ఈవ్ టీజ‌ర్ల ఆటలు కట్టించేందుకు మ‌హిళ‌లు, యువతుల కోసం ఏర్పాటు చేసిన టీమ్ అది. అందులో అనేక మంది పోలీసులు గ్రూపులుగా విడిపోయి ఈవ్ టీజ‌ర్ల‌ను గుర్తించి వారికి బుద్ధి చెబుతారు. అయితే స‌రిగ్గా ఇలాంటి ఓ టీమ్‌నే కొత్త‌గా ఏర్ప‌డిన ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. దాని పేరు యాంటీ రోమియో స్క్వాడ్‌. దాన్ని లీడ్ చేసేది ఎవ‌రో తెలుసా..? ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌..!

ఆమె పేరు చారు సింగ్. యంగ్‌, డైన‌మిక్ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఈమె. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఈ మ‌ధ్యే బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే క‌దా. యోగి ఆదిత్య నాథ్ ఆ రాష్ట్ర సీఎం కూడా అయ్యారు. అయితే బీజేపీ ప్ర‌భుత్వం యూపీలో వ‌స్తే అనేక ప‌నులు చేస్తామ‌ని అక్క‌డి బీజేపీ నాయ‌కులు ఎన్నిక‌లకు ముందు చెప్పారు. అందులో భాగంగానే యోగి ఆదిత్య‌నాథ్ సీఎం కాగానే ఆయ‌న రోజుకో కొత్త సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణ‌యాల్లో ఒక‌టే యాంటీ రోమియో స్క్వాడ్‌. దానికి లీడ‌ర్‌గా ఐపీఎస్ అధికారిణి చారు సింగ్‌ను నియ‌మించారు.

చారు సింగ్ నేతృత్వంలోనే యాంటీ రోమియో స్క్వాడ్ ప‌నిచేయ‌నుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి స్కూల్‌, కాలేజీ వ‌ద్ద‌, బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ ఈ యాంటీ రోమియో స్క్వాడ్ కు చెందిన పోలీసులు ఉంటారు. వారు మ‌ఫ్టీలో ఆయా ప్రాంతాల్లో కాపు కాస్తారు. ఒక్కో ప్రాంతం వ‌ద్ద ఒక్కో టీమ్ ఉంటుంది. అందులో ఇద్ద‌రు పోలీసు సిబ్బంది ఉంటారు. ఒక‌రు పురుషుడు, ఒక‌రు స్త్రీ. వారు ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా ఎవ‌రైనా కావ‌చ్చు. టీంగా ఏర్ప‌డి అమ్మాయిల‌ను ఏడిపించే ఆక‌తాయిల‌ను, ఈవ్ టీజ‌ర్ల‌ను గుర్తిస్తారు. అనంత‌రం వారిని ప‌ట్టుకుని ముందుగా వారి త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేస్తారు. అప్ప‌టికీ విన‌కుండా రెండో సారి దొరికితే కౌన్సిలింగ్ ఇస్తారు. అయినా విన‌క‌పోతే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తారు. ఇదీ ఆ స్క్వాడ్ చేసే పని. ఏది ఏమైనా ఇలాంటి బృందాలు ప్ర‌తి రాష్ట్రంలోనూ ఉండాల్సిందే. అప్పుడైనా కొంత‌లో కొంత మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top