అమెరికా అధ్యక్షఎన్నికల్లో…అంతరిక్షం నుండి వోటేసిన వ్యోమగాములు..ఇదెలా సాధ్యమో తెలుసా?

aపోలింగ్ నిర్వహించే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం గురించి మనకు తెలుసు….కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కిమ్ బ్రాగ్, రుబిన్స్ అనే ఇద్దరు వ్యోమగాములు  తమ ఓటు హక్కును అంతరిక్షం నుండి వినియోగించుకున్నారు . తొలిసారిగా  1997 లో  డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి అంతరిక్షం నుండి ఓటు వేశాడు.అతని కోసమే మొదటిసారిగా ఎన్నికల నిబంధనలు సడలించారు.

వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ ఒక యేడాది ముందే స్టార్ట్ అవుతుంది. స్పేస్ లోకి వెళ్లే వ్యోమగాములు ముందుగానే తాము ఏ ఎన్నికల్లో ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి, దానికి సంబంధించి తమ వివరాలను అందించాల్సి ఉంటుంది. అన్ని ఓకే అయ్యాక వారి పేరు మీదుగా తయారు చేయబడిన పోస్టల్ బ్యాలెట్/ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్  ను అంతరిక్షంలోకి సదరు వ్యోమగామికి పంపుతారు. అలా ఆస్ట్రోనాట్ అంతరిక్షం నుండి వేసిన ఆ ఓట్  స్పేస్ సెంటర్ ద్వారా.. పోలింగ్ అధికారుల సమక్షంలో….. బ్యాలెట్ లో భద్రపర్చడం జరుగుతుంది.

shane-kimbrough-iss-vote

సాధారణంగా వ్యోమగాములు…ఓటు వేయడానికి అంతగా ఇష్టపడరు, కానీ…. ఓటు యొక్క ఆవశ్యకత తెలిపేందుకే..ఇలా చేశానని చెబుతున్నాడు కిమ్ బ్రాగ్…..ఓట్లు వేసే రోజు హాలిడే అని ఫీల్ అయ్యి, ఇంటి గడప కూడా దాటని మనదేశంలోని చాలా మందికి ఈయన చేసిన పని కనువిప్పు కల్గించాలని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top