అంటురానిత‌నం….ఆలోచింప‌జేపచేసిన ఓ మంచి షార్ట్ ఫిల్మ్.

వెండితెర‌ను అందుకోడానికి యంగ్ స్ట‌ర్స్ కొత్త ఆయుధం షార్ట్ ఫిల్మ్స్.! ఓ ఫుల్ లెంగ్త్ మూవీని త‌ల‌పించేలా ఉన్న షార్టీస్ తెలుగులో చాలానే వ‌చ్చాయి..వ‌స్తున్నాయి కూడా.!! ల‌వ్ స్టోరీస్, స‌స్పెన్స్ అండ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్….ఇలా ల‌ఘుచిత్రాల్లో కూడా మ‌నోళ్ళు అన్ని జాన‌ర్స్ ను ట‌చ్ చేశారు. అయితే ఈ క్ర‌మంలో ఓ ద‌ర్శ‌కుడి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. యంగ్ డైరెక్ట‌ర్స్ అంతా ల‌వ్ స్టోరీల‌పై క‌థ‌ల‌ను అల్లుకుంటుంటే…ఈ ద‌ర్శ‌కుడు మాత్రం మాన‌వ విలువ‌లను త‌ట్టిలేపే అంశాల‌ను క‌థాంశాలుగా ఎంచుకొని సామాజిక రుగ్మ‌త‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి త‌న ల‌ఘుచిత్రాల‌నే ఆయుధాలుగా వాడుతున్నాడు.

డాక్ట‌ర్ ఆనంద్…డాక్ట‌ర్ విద్య‌న‌భ్య‌సించి….సినిమాల మీద ఉన్న ఫ్యాష‌న్ తో….సమాజం మీద ఉన్న త‌న‌దైన దృష్టి కోణంతో షార్ట్ ఫిల్మ్స్ తీయ‌డం స్టార్ట్ చేశాడు. ప్ర‌జాహ‌క్కు అంటూ విద్య యొక్క అవ‌స‌రాన్ని ఎంతో హృ0ద్యంగా చూపించాడు ఈ డైరెక్ట‌ర్. ఈ లఘుచిత్రానికి గానూ ఎన్నో అవార్డుల‌ను సైతం ద‌క్కించుకున్నాడు ఆనంద్.

ఇక తాజాగా అంటురాని త‌నం అంటూ….మ‌రో సామాజిక‌ అంశాన్ని క‌థాంశంగా తీసుకొని దాన్నే షార్ట్ ఫిల్మ్ గా మ‌లిచాడు. అంటుక‌ట్టుడు ప‌ద్ద‌తి ద్వారా అధిక దిగుబ‌డులు సాధిస్తున్న ఈ కాలంలో…మ‌నుషుల్లో మాత్రం ఇంకా అంటరానిత‌నం ఏ స్థాయిలో ఉందో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు ఈ షార్టీ ద్వారా.! ముఖ్యంగా ఆ ఇంట్రో లైన్స్ చాలా ఆక‌ట్టుకున్నాయి..అంత‌కు మించి ఆలోచ‌న‌లో ప‌డేశాయ్.!! చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్ప‌గ‌లిగిన‌ప్ప‌టికీ….క‌థ‌కు ఇంకొన్ని హంగులు అద్ది..స్టోరీని ఇంకాస్త డ్రామెటిక్ చేసుంటే బాగుండేది. బ‌లంగా ప్రెజెంట్ చేయాల్సిన ఫీలింగ్స్ ను వాయిస్ ఓవ‌ర్ తో న‌డిపించిన ఫీలింగ్ క‌లిగింది.

ఏది ఏమైనా…. సామాజిక దృష్టితో….స‌మాజంలో పాతుకుపోయిన సామాజిక రుగ్మ‌త‌ల‌నే ఇతివృత్తాలుగా తీసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్న డైరెక్ట‌ర్ అనంద్ కు అభినంద‌న‌లు.

Watch ANTUraanitanam:

Cast & Crew:

  • రచన – దర్శకత్వం:  ఆనంద్ కుమార్
  • సంగీతం: గీత
  • నిర్మాత: N.S నాయక్.
  • CAST: Hasini Anvi, Rehana Shameem, Sandhya Janak,Rajasekhar, Suman Rudru, Gyan, etc….

Comments

comments

Share this post

scroll to top