“జాన్వీ ని తిడితే ఊరుకోను..!”…ఫాన్స్ పై ఫైర్ అయిన “జాన్వీ” సోదరి “అన్షులా”.! అసలేమైంది..?

ప్రముఖ నటి శ్రీదేవి మరణం యావత్‌ అభిమానులనే కాదు తన సొంత కుటుంబ సభ్యులను కూడా శోక సంద్రంలో ముంచింది. ఆమె అంత అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్‌, ఖుషి కపూర్‌లు తట్టుకోలేకపోయారు. దీంతో వారిని ఓదార్చేందుకు యావత్‌ భారతీయ సినీ ప్రపంచం కదలి వచ్చింది. ఎంతో మంది నటులు, సెలబ్రిటీలు వారికి ఓదార్పునిచ్చారు. అయినా తల్లి దూరమైందంటే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. కనుక ఇప్పుడప్పుడే వారు తమ తల్లి దూరమైందన్న ఘటనను మరిచిపోలేరు. అయితే ఓ వైపు వారు తమ బాధలో తాము ఉంటే కొందరు మాత్రం వారిని విమర్శించడం, అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు.

శ్రీదేవి బోనీకపూర్‌కు రెండో భార్య అని తెలుసు. అంతకు ముందు ఉన్న భార్య చనిపోవడంతో బోనీ కపూర్‌ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య సంతానం అయిన అర్జున్‌ కపూర్‌, అన్‌షులా కపూర్‌లు తమ సవతి తల్లి శ్రీదేవితో ఎప్పుడూ కలసి ఉండేవారు కాదని, ఇక ఆమె కూతుళ్లు, తమ చెల్లెల్లు అయిన జాహ్నవి, ఖుషి కపూర్‌లతోనూ వారు కలిసే వారు కాదని, వారిని పట్టించుకోరని పలువురు నెటిజన్లు అర్జున్‌ కపూర్‌ను, అతని చెల్లె అన్‌షులా కపూర్‌ను విమర్శించారు. వారిని అసభ్య పదజాలంతో దూషించారు. ఇక సందట్లో సడేమియాలా మరోవైపు కొందరు జాహ్నవి, ఖుషి కపూర్‌లను కూడా విమర్శించారు.

అయితే పలువురు నెటిజన్లు చేసిన ఆ విమర్శలను అర్జున్‌ కపూర్‌ తిప్పికొట్టాడు. తాను తన సవతి తల్లితో ప్రేమగానే ఉంటాడని, ఆమెతో అన్యోన్యంగా ఉంటామని, అలాంటిది తమ గురించి అలా విమర్శించడం సరికాదన్నాడు. తన చెల్లెల్లు ఖుషి, జాహ్నవి అన్నా తనకు ఇష్టమేనని, శ్రీదేవి సవతి తల్లి అయినా మాకు ఎప్పుడూ ఆ భావన కలగలేదని అర్జున్‌ కపూర్‌ అన్నాడు. ఇక అతని చెల్లెలు అన్‌షులా కూడా అన్నను సమర్థించింది. తాము ఒక ఫ్యామిలీలా కలసి ఉంటున్నామని, అలాంటి తమపై అభాండాలు వేయడం సరికాదని, అసభ్య పదజాలంతో దూషిస్తే మర్యాదగా ఉండదని ఆమె హెచ్చరించింది. ఏది ఏమైనా శ్రీదేవి మరణం తరువాత మొదటి భార్య పిల్లలు ఇద్దరు ఆమె పిల్లలతో కలిసే ఉంటున్నారని మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా వారంతా ఒకే ఫ్యామిలీలా ముందుకు సాగాలని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top