మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు వర్థంతి సందర్భంగా ఆయన గురుంచి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..!!

అక్కినేని నాగేశ్వరరావు గారు సెప్టెంబర్ 20,1923 లో జన్మించారు. జనవరి 22,2014 న మనల్ని విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు, ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం మీకోసం.

నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఆయనను అందరూ మన్మధుడు అనిపిలుస్తారు, నట సామ్రాట్ అని ఫ్యాన్స్ ఆయనను ముద్దుగా పిలుచుకొనేవారు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు.

1940 లో విడుదలైన “ధర్మపత్ని” ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం “శ్రీ సీతారామ జననం” (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మందుకుబానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు.

పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ( మాయాబజార్ ), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం )లో రాణించాడు. గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, మరియు నమ్మినబంటులో నటించి, తెలుగు నటసామ్రాట్గా పేరుపొందాడు మిస్సమ్మ, చక్రపాణి మరియు ప్రేమించుచూడు లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలామజ్ను, అనార్కలి(1955), బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం,మరియు మేఘసందేశంలో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.

ప్రేమాభిషేకం…

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు. ప్రేమలో ‌ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవంపోసింది.ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషలలో నటించినా, ప్రముఖ హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించినదే ఒకేఒక దేవదాసు అని అన్నాడు.

సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి,మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, మరియు కాలేజి బుల్లోడు లాభాలుపొందిన సినిమాలు. 1991 లోఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త మరియు యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున మరియు మనవడు నాగచైతన్యతో కలిసినటించిన మనం ఆయన నటించిన చివరి సినిమా.

వివిధ ప్రాంతాల సాహిత్య మరియు సాంస్కృతిక ప్రముఖుల పాత్రలు అనగా, ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిషాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన,తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాం లను తెరమీదికి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు మరియు కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు . సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడవచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు గారు అందుకున్న అవార్డులు :

10.03.1988 – సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
రాజ్ కపూర్ స్మారక అవార్డు –

10.06.1989 – కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.
రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు –

10.03.1980 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
పద్మవిభూషణ్(భారత ప్రభుత్వం)
.
పద్మ భూషణ్ – 1988 – భారత ప్రభుత్వం.

కాళిదాస్ సమ్మాన్—మధ్య ప్రదేశ్
.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – 07.04.1991 –
.
ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు –

21.10.1994 – కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
అన్నా అవార్డు
– 24.11.1995 – జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
.
పద్మశ్రీ – 1968 భారత ప్రభుత్వం.

యన్టీయార్ జాతీయ పురస్కారము (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)

డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు

నటసామ్రాట్
కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)

Comments

comments

Share this post

scroll to top