భర్త ఎదుటే భార్యపై అత్యాచారం, ఆ తర్వాత భర్తను భార్యను కలిపి చంపేశారు.!

ఏ వ్య‌క్తి అయినా నేరం చేస్తే పోలీసులు అత‌న్ని ప‌ట్టుకుని కోర్టు ఎదుట ప్ర‌వేశ పెట్టి శిక్ష ప‌డేలా చేస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రుగుతుంది. అంతా స‌హ‌జ‌మే. అదీ నేర‌స్తున్ని పోలీసులు ప‌ట్టుకుంటే. మ‌రి ప‌ట్టుకోక‌పోతే..? ఏముందీ, ఆ నేర‌స్థుడు య‌థేచ్ఛ‌గా తిరుగుతాడు. మ‌రిన్ని నేరాల‌కు పాల్ప‌డుతాడు. ఇది కూడా స‌హ‌జంగా జ‌రిగేదేగా..! ఇందులో కొత్తేముందీ… అంటారా..! మీరంటోంది క‌రెక్టే. ఇక్క‌డి వ‌ర‌కు అంతా స‌హ‌జంగానే ఉంది. కానీ ఏ నేర‌స్తుడైనా ఒకే లాంటి నేరానికి పాల్ప‌డితే..?  వారు పోలీసుల‌కు దొరికి, కోర్టు ద్వారా శిక్ష అనుభ‌విస్తున్నా, ఇత‌ర నేర‌స్తులు కూడా అలాంటి నేరాల‌కే పాల్ప‌డితే, కొత్త‌గా నేరం చేసే వారు కూడా ఒకే త‌ర‌హా నేరానికి పాల్ప‌డుతూ ఉంటే..? అప్పుడు త‌ప్పు ఎక్క‌డ ఉంది అనుకోవాలి..?  పోలీసుల ద‌గ్గ‌రా..?  కోర్టుల్లోనా..? అవి అమ‌లు చేసే శిక్ష‌ల్లోనా..?  కోర్టులు వేసే, అమ‌లు చేసే శిక్ష‌ల్లోనే త‌ప్పుంది, లేక‌పోతే, శిక్ష ప‌డుతుంద‌ని తెలిసినా, ఏ మాత్రం భ‌యం లేకుండా అందరూ ఒకే త‌ర‌హా నేరాన్ని ఎందుకు చేస్తారు..! అని ఆ మూడు ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రైనా స‌మాధానం చెబుతారు. ఎందుకంటే, పోలీసులు మ‌నుషులే, కోర్టుల్లో ఉండేది మ‌నుషులే, వారిని ఏమ‌న్నా అంటే ఎవ‌రూ ఊరుకోరు. ఎటొచ్చీ శిక్ష‌లే మ‌నుషులు కాదు క‌దా… కాబ‌ట్టి వాటిలోనే త‌ప్పుందీ… మ‌ర‌లాంట‌ప్పుడు వాటిని మార్చాల్సిన అవ‌స‌రం ఉందంటారా..?  లేదంటారా..?

punjab-nirbhaya
ఏంటీ… చెప్పే విష‌య‌మేదో సూటిగా చెప్ప‌క‌, ఈ డొంక తిరుగుడు అంతా దేనికి అని విసుగు చెందుతున్నారా..?  మీరు విసుగు చెందినా, ఏం చెందినా పైన మేం చెప్పింది నిజ‌మే. కాదంటారా..? అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది చ‌ద‌వండి. మేం చెప్పింది నిజ‌మేనని నమ్ముతారు.

పైన మేం ఎక్కువ‌గా ఓ ప‌దం ఉప‌యోగించాం, ప‌రిశీలించారా..? అదేనండీ… ఒకే త‌ర‌హా నేరం. అవును, అదే. ఇంత‌కీ ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న ఆ ఒకే త‌ర‌హా నేరం ఏంటో తెలుసా..? అదే అత్యాచారం. రేప్‌. లైంగిక దాడి. పేరేదైనా అందులో బ‌లి చెందేది స్త్రీలే. ఇలాంటి నేరాలే ఇప్పుడు ఎక్కువగా జ‌రుగుతున్నాయి. అదేంటీ, నిర్భ‌య చ‌ట్టం ఉందిగా..? అంటే, చ‌ట్టం లేకేం ఉంది. కానీ అందులో వేసే శిక్ష‌లే పైన మేం చెప్పిన‌ట్టుగా ఏమాత్రం భ‌య‌పెట్టే విధంగా లేవు. అందుకే ఆ త‌ర‌హా నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌లోని మొహాలీలో జ‌రిగింది కూడా ఇలాంటి దారుణ‌మైన ఓ సంఘ‌ట‌నే. 19 ఏళ్ల న‌వ వివాహిత‌ను ఆమె భ‌ర్త ఎదుటే దారుణంగా, అత్యంత కిరాత‌కంగా రేప్ చేసి మ‌రీ చంపారు. అనంత‌రం ఆ భ‌ర్త‌ను కూడా చంపారు. త‌రువాత వారిద్ద‌రి శ‌వాల‌ను వారి ఇంటి పైక‌ప్పుపై నేర‌స్తులు ప‌డేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘ‌ట‌న అనేక మందిని, ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. రేపెప్పుడైనా తాము ఒంటరిగా వెళ్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు ఇప్పుడు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇప్పుడిక అస‌లు విష‌యానికి వ‌స్తే, పైన మేం ఇంత‌కు ముందే చెప్పాం క‌దా. శిక్ష‌ల‌ల్లో త‌ప్పుంది, వాటిని మార్చాల‌ని… అవును, ఆ విష‌యాన్నీ… ఒకే త‌ర‌హా నేర‌మైన అత్యాచారాల‌ను…. తాజాగా పంజాబ్‌లో జ‌రిగిన దారుణ‌మైన సంఘ‌ట‌న‌ను… ప‌క్క ప‌క్క‌నే పెట్టుకుని ప‌రిశీలించండి. మీకు ఏం అర్థ‌మ‌వుతోంది..? ఈపాటికే మీరు మ‌న‌స్సులో అనుకునే ఉంటారు, క‌చ్చితంగా నేర‌స్తుల‌కు వేసే శిక్ష‌ల‌ను మార్చాల్సిందే, వాటిలోనే త‌ప్పుందీ అని. చూశారా… మేం చెప్పింది నిజ‌మేన‌ని ఇప్ప‌టికైనా న‌మ్ముతున్నారా..? అవును, నమ్మాల్సిందే. ఎందుకంటే ఒకే త‌ర‌హా నేరాలు జ‌రుగుతున్నా, శిక్ష‌లు ప‌డుతున్నా అలాంటి నేరాలు ఇంకా ఎక్కువ‌వుతూనే ఉన్నాయి కానీ, త‌క్కువ కావ‌డం లేదంటే, శిక్ష‌లను మార్చాల్సిందే అనే క‌దా అర్థం వ‌స్తుంది. మ‌రి… ఈ విష‌యం ప్ర‌భుత్వాల‌కు, ముఖ్యంగా నాయ‌కుల‌కు చెవికెక్కుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఒక ఢిల్లీ, ఒక హైదరాబాద్‌, ఒక పంజాబ్… లాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి… ‘We are eagerly waiting for a change that can change the mindset of rapist criminals…’

Comments

comments

Share this post

scroll to top