ఇద్దరమ్మాయిల మద్యలో మాడిపోయిన దోశ.

ఇదేంటి అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలో టైటిల్ లాగా  ఉందనుకుంటున్నారా..? ఏం చేస్తాం అండి ఎంత వద్దనుకున్నా… మనోళ్ళ క్రియేటివిటి పొగడలేక పోతున్నాం.  అవును ఇద్దరమ్మాయిలు.. మద్యలో దోశ.. కాదు కాదు మద్యలో మాడిపోయిన దోశ..ఇది టైటిల్.. అయితే వీటిలో పాత్రలను ముందుగానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం…..

యూట్యూబ్  వారి సౌజన్యంతో…. మీముందుకు వస్తుంది ఇద్దరమ్మాయిల మద్యలో మాడిపోయిన దోశ.. ఇందులో ఒక అమ్మాయి అన్నపూర్ణ సుంకర కాగా, మరో అమ్మాయి దివ్య గోపాల్.. ఇక దోశ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా…  ఉల్లిదోశనా, మసాలా దోశనా, ప్లేన్ దోశనా అనే డౌట్లు వద్దు.. దోశ దోశే .. కానీ ఇక్కడ మాత్రం మాడిపోయిన దోశ.

ఇక స్టోరి విషయానికి వస్తే..  సుమారు 15 రోజుల క్రితం అన్నపూర్ణ సుంకరి అనే అమ్మాయి… తెలుగు సినిమాలు మారాలి అంటూ చేసిన వీడియో గుర్తుంది కదండీ… దాని మీద అనేక కౌంటర్లు.. డబ్ స్మాష్ వీడియోలు వచ్చాయ్..అవన్నీ మీరు చూసేసారు. అది పాత ముచ్చట..ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటో తెలుసా…. సినిమాలు మారాలి అనే అన్నపూర్ణ వీడియోని రిమిక్స్ చేసింది దివ్య గోపాల్….  సేమ్ టు సేమ్ అదే ఆహార్యం, అదే ప్రాస, అదే డైలాగ్ ప్లో.. కానీ డైలాగ్ లు మాత్రం వేరు.. ఆమె సినిమాల గురించి మాట్లాడితే, ఈమె  మాడిపోయిన దోశ గురించి మాట్లాడింది. దివ్యకు ప్రేరణ మాత్రం అన్నపూర్ణనే..

ఇప్పుడు వీడియో చూడండి:

గతంలో అన్నపూర్ణ సుంకర వీడియో చూడని వాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ మరోసారి:

CLICK: బాహుబలి ధీవరా సాంగ్ ను బాలయ్య బాబు చేస్తే..!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top