ఎన్టీఆర్ చనిపోయేముందు రోజు ఇలా జరిగింది అంట..! సాయంత్రం 4 గంటలకు అన్నగారి ఆఖరి కుమారుడొచ్చి.!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు..చదువుతుంటేనే ఎంతో గంభీరంగా ఉంది కదా..తెలుగునాట తన నటనతోనే కాదు రాజకీయంగా కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడాయన..తను పోయి ఇన్నేళ్లయినా “అన్నగారు” గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని స్థానం ఆయన సొంతం..రెండురోజులుగా సోషల్ మీడియాలో,వార్తల్లో అన్నగారి ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి..ఎన్టీవోడు గా ప్రేమగా పిలుచుకునే ఎన్టీయార్ వర్ధంతి సంధర్బంగా  అందరం ఆయన్ని స్మరించుకుంటున్నాం..కానీ ఊహ తెలిసినప్పటి నుండి వెన్నుపోటు పొడిచారు అనే మాట వింటూనే ఉన్నాం.సింహంలా బతికినాయన చివరి రోజుల్లో కుంగిపోయారని వార్తలు విన్నాం.. .ఒక క్షణం ఇంతపెద్ద కుటుంబం , ఇంతమంది అభిమానులు  ఉన్నాయన చివరి క్షణంలో ఎందుకు కుంగిపోయారు .అప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత ప్రేమ కురిపిస్తున్నారు అనే అనుమానాలు రాకమానదు.ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా చూసినవారికి కూడా నందమూరి చివరిరోజులు ఆయన పరిస్థితి ఏంటి అనేది తెలియదు…అయితే  తిప్పరాజు రమేశ్ బాబు అనే అప్పటి జర్నలిస్ట్ ఈ రోజు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్టు చర్చనీయాంశం అయింది..సోషల్ మీడియాలో,వాట్సప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుంది..ఎన్టీయార్ చనిపోయిన రోజు ఈ విధంగా జరిగిందా అని అందరిని కంటతడి పెట్టిస్తుంది..ఆయన పెట్టిన పోస్టు యధాతధంగా….

“”నేను ఢిల్లీ లో ఉద్యోగం చేసేవాడిని ;; సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ ఇంటికి వచ్చా ;;;””

“”జనవరి 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు గారింటికి (రోడ్ నంబర్ 13 , బంజారా హిల్స్ ) వెళ్ళా ;; ఆయన్ని, లక్ష్మి పార్వతిని కలసి చాలా గంటలు గడిపా ;;””

“”ఎంతైనా మహా నటుడు కదా ;; ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్నా పైకి నవ్వుతూనే మాతో గడిపారు “”

సాయంత్రం 4 గంటలు అయింది ;; అన్నగారి ఆఖరి కుమారుడు జై శంకర్ కృష్ణ వచ్చి కొంచెం సేపు మాట్లాడి డబ్బులు అడిగి తీసుకెళ్ళాడు ;;

సాయంత్రం 5 గంటలు ;; అన్న గారి ముఖంలో తీవ్ర ఆందోళన ;

సాయంత్రం 6 గంటలు ;; తెలుగు దేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ;; యెన్ . వి. రమణ , శ్రీనివాస రావు అన్నగారి దగ్గరకు వచ్చారు ;;

సాయంత్రం 6.30 నిమిషాలు ;;””ఒక్కసారిగా ;; ఏం బ్రదర్స్ “”

ఏం జరిగింది ;??””

సార్ ;; హై కోర్ట్ లో మనం కేసు ఓడిపోయాం ;; తెలుగు దేశం పార్టీ బాంక్ ఖాతాలు అన్నీ చంద్ర బాబు పార్టీ కే చెందుతాయని ;; బాంకుల్లో మీ సంతకాలు చెల్లవని చీఫ్ జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా నేతృత్వం లోని బెంచ్ తీర్పు చెప్పింది ;;”” అన్నారు ;;

ఖిన్నుడైన అన్నగారు కుర్చీ లోంచి ఒక్కసారిగా లేచి “”దరిద్రులు ;; చండాలులు;; మోసగాళ్ళు ;; పిల్ల నిచ్చి ;; పదవి ఇచ్చి , ఆస్తి ఇచ్చి ఆదరించి , అభిమానించి మంత్రిని చేస్తే “” శాసనసభ్యుల్ని , ఆస్తుల్ని ;; పార్టీని ;; పార్టీ గుర్తుని “”దొబ్బెసాడు ” అంటూ గట్టిగా అరుస్తూ ;;; భోరు భోరున విలపిస్తూ ;; గుండె బాదుకుంటూ ;;; తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు ;; లోపల గడియ పెట్టేసుకున్నారు ;; లక్ష్మి పార్వతి ;; నేను ;; అశోక్ ఎంత పిలిచినా ;; తలుపు కొట్టినా తలుపు తీయలేదు ;;

రాత్రి 8.00 గంటలకి తలుపు తీసి ;; గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి “”జీవితంలో నమ్మి మోసపోయా “” అంటూ ఏడుస్తూనే ఉన్నారు ;; పాలు ఇస్తే తాగలేదు ;; భోజనం చెయ్యమంటే చెయ్యలేదు ;;

రాత్రి 9 గంతలు ;;; రమేష్ ;; అన్నగారికి ఎక్కిళ్ళు వస్తున్నాయ్ ;; మంచినీళ్ళు ఇస్తే త్రాగడం లేదు ;; అందరూ రండి ;; మంచి నీళ్ళు త్రాగిద్దాం అని లక్ష్మి పార్వతి పిలిస్తే వెళ్లి బ్రతిమిలాడగా ;; బ్రతిమిలాడగా “”గుక్కెడు “” మంచినీళ్ళు త్రాగారు ;;ఏడుపు ఆగలేదు ;; ఎక్కిళ్ళు ఆగలేదు ;; అందరూ వెళ్ళిపొండి అని ఆదేశాలు జారీ చేశారు ;; andaram బయటకు వచ్చేశాం ;; లక్ష్మి పార్వతి అన్నగారిని ఓదారుస్తోంది ;;

ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు ఆయన ఇంట్లోనే ఉన్నా ;

తర్వాత బయలుదేరి పద్మారావు నగర్ ఇంటికి చేరుకున్నా ;;

నాలో ఆందోళన ;; భయం ;; నిద్ర రావడం లేదు ;;

తెల్లవారున 4 గంటలకి కొంచెం నిద్ర వస్తోంది ;; అప్పుడే నా పెద్ద కూతురు నళిని వచ్చి “”డాడీ”” లక్ష్మి పార్వతి మేడం phone చేశారు ;; లైన్ లో ఉన్నారు “” అని చెప్పింది ;

phone రిసీవర్ అందుకున్నా ;;లక్ష్మి పార్వతి మాటలకు

“”హతాసుడిని అయ్యా “” నా నోరు మూగబోయింది ;; మూర్చ వచ్చేట్లు ఉండి కూడా మొహం కడుక్కుని అన్నగారింటికి బయలుదేరా ;

ఆ దృశ్యాన్ని చూడలేకపోయా ;;;

“”అన్నా ;; నీ అనురాగం “”

“”ఎన్నెన్నో జన్మల బంధం నీదీ -నాదీ””

అనుకుంటూ ;;

 విషన్నవదనంతో అక్కడే కుప్పకూలిపోయా ;;

అన్నగారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనసారా ప్రార్ధిస్తూ;;

Comments

comments

Share this post

scroll to top