ఐటీలో ఏపీ మేటి – అంకుర సంస్థ‌ల‌కు కొండంత అండ

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ – తెలంగాణ రాష్ట్రాలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి. స్టార్ట‌ప్ కంపెనీల‌ను ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హించ‌డంలో ముందంజ‌లో ఉన్నాయి. ఇండియాలో ఒక‌ప్పుడు ఐటీ అనే స‌రిక‌ల్లా బెంగ‌ళూరు పేరు చెప్పే వాళ్లు..ఇపుడు అమ‌రావ‌తి, హైద‌రాబాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు న‌గ‌రాల‌కే ఇత‌ర దేశాలు ఓటు వేస్తున్నాయి. త‌మ ప్ర‌యారిటీస్ అన్నీ వీటిపైనే. నైపుణ్యాభివృద్ధి క‌ల్పించ‌డంలో..కొత్త త‌రాన్ని గుర్తించి తీర్చిదిద్ద‌డంలోను..వారి మెద‌ళ్ల‌కు మేత పెట్ట‌డం..క్రియేటివిటీని కంపెనీలు ఏర్పాటు చేసేలా తీర్చిదిద్ద‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఐటీ అంటేనే చంద్ర‌బాబు. ఏ ముఖ్య‌మంత్రికి లేనంత ప‌ట్టుద‌ల‌..ఐటీ ప‌ట్ల అనుర‌క్తి. ఆయ‌న‌కే ఉంది.

andhra pradesh it

ఎక్క‌డికి వెళ్లినా..ఏ సమావేశంలో మాట్లాడినా ఆయ‌న ఐటీ గురించి త‌ప్ప‌కుండా ప్ర‌స్తావిస్తారు. త‌న కుమారుడు లోకేష్ కు ఐటీ శాఖ అప్ప‌గించారు. ప‌లు దేశాలు ప‌ర్య‌టించారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటు కావ‌డం, ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లేక పోవ‌డం, వ‌న‌రులు స‌మ‌కూర‌క పోయినా బాబు మొద‌టి ప్రాధాన్య‌త ఐటీ రంగానికి క‌ల్పించారు. ఆ దిశ‌గా యుద్ద ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేశారు. సైబ‌రాబాద్ ఆయ‌న కృషి వ‌ల్ల‌నే ఏర్పాటైంది. ఐటీకి ఒక రూపు, బ్రాండ్ , ఇమేజ్ తీసుకు రావ‌డంలో ఆయ‌న పాత్ర‌ను కాద‌న‌లేం. ఇపుడు తెలంగాణ స‌ర్కార్ ఏపీతో పోటీ ప‌డుతోంది. ఇరు తెలుగు ప్రాంతాలు అమెరికా ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌తి పేరున్న ఐటీ కంపెనీలు ఇక్క‌డ ఏర్పాటు చేసేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నాయి.ఈ-కామ‌ర్స్, డిజిట‌ల్ టెక్నాల‌జీ, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బీజీపీ, కేపీఓల‌తో పాటు స్టేట్ అన్ని రంగాల‌లో టెక్నాల‌జీని వాడుకునేలా ఏపీ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ కృషి చేస్తోంది. ప్ర‌తి ఇంటికి ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించేలా పాఠ‌శాల‌ల స్థాయి నుండే విద్యార్థుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాంను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హిస్తోంది. ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ఏపీ ఎన్ ఎస్ డీసీ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పింది.

ప్ర‌తి ఒక్క‌రు ఐటీలోనే కాదు డిజిట‌ల్ రంగంలో కూడా స‌క్సెస్ ఫుల్ కావాల‌న్న ల‌క్ష్యంతో ముందుకెలుతోంది. రాబోయే కాలంలో ఏ ఒక్క‌రు ప‌ని లేకుండా ఉండ‌రాద‌నే ఉద్ధేశంతో ఉపాధి క‌ల్పించే ఐటీ ఆధారిత కోర్సుల‌ను నిర్వ‌హించి ..శిక్ష‌ణ ఇస్తోంది. సైబ‌ర్ సెక్యూరిటీ, డేటా అన‌లిటిక్స్, లాజిస్టిక్స్, గేమింగ్ , ఎంట‌ర్ టైన్ మెంట్, టూరిజం, హెల్త్ కేర్, టెలికాం , త‌దిత‌ర రంగాల‌లో స్థిర ప‌డేలా వీటిలో త‌ర్ఫీదు ఇస్తోంది. ఐటీ ఎక్స్ ప‌ర్ట్ చౌద‌రి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ రంగంలో కొత్త పుంత‌లు తొక్కుతోందంటే దీనికంతటికి కార‌ణం జే.ఎ. చౌద‌రి గారే కార‌ణం. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా , ఐటీ రంగంలో స‌ల‌హాదారుగా ఉన్నారు. విశాఖ‌, అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి న‌గ‌రాల‌ను ఐటీ హ‌బ్ లుగా మార్చేశారు. ఈ దేశంలోనే కాదు ప్ర‌పంచానికే అమ‌రావ‌తి ఆద‌ర్శం కావాల‌న్న‌ది చంద్ర‌బాబు కల‌. దానిని నిజం చేసేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు చౌద‌రి. ఏపీ హ‌బ్ ద్వారా స్టార్ట‌ప్ కంపెనీల‌ను  ప్రోత్స‌హిస్తున్నారు.

న్యూ ఐడియాల‌ను గుర్తించి..అవి కంపెనీలుగా మారేలా మెంటార్ల‌ను, ట్రైన‌ర్స్‌ను , టెక్నాల‌జీ ప‌రంగా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ..ఫండింగ్ సైతం ప్ర‌భుత్వ ప‌రంగా అందేలా చూస్తున్నారు. దీంతో ఎంద‌రో యువ‌తీ యువ‌కులు ఇంజ‌నీర్లుగా, ట్రైన‌ర్స్‌గా న్యూ ఐడియాస్ తో స్టార్ట‌ప్‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. ఎలాంటి పెట్టుబ‌డులు లేవు. ఎలాంటి వ‌న‌రులు లేవు..ఓ వైపు ప్ర‌కృతి వైప‌రీత్యాలు, టెలికాం వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. అయినా మేం అనుకున్న‌ది సాధిస్తామంటున్నారు చౌద‌రి. ఐటీ రంగంలో అపార‌మైన అనుభ‌వం ఆయ‌న స్వంతం. 1955లో అనంత‌పురం జిల్లా బ‌త్త‌ల‌ప‌ల్లె గ్రామంలో జ‌న్మించిన ఆయ‌న‌కు 63 ఏళ్లు. అయినా ఏపీని అన్నింట్లో మెరుగైన స్థానంలో ఉండేందుకు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. బాబుకు చేదోడుగా ఉంటూ ఐటీ రంగంలో త‌మ‌దైన ముద్ర ఉండేలా ఏపీని ఓ స్టార్ట‌ప్ స్టేట్‌గా మార్చేశారు. ఇదంతా ప్ర‌తిభ‌కు..మేధో మ‌ధ‌నానికి..ప‌ట్టుద‌ల‌కు..ఆచ‌ర‌ణ‌కు ద‌క్కిన గౌర‌వంగా మేం భావిస్తున్నాం. ఎన్నో విప‌త్తులు ఎదుర్కొన్నాం. ప్ర‌తి రంగానికి ఐటీని అనుసంధానం చేసేలా చూస్తున్నాం. సింగ‌పూర్, మ‌లేషియా, బ్యాంకాక్, అమెరికా , చైనా లాంటి విదేశీ కంపెనీలు అమ‌రావ‌తి వైపు చూస్తున్నాయి.

ఇదంతా ఐటీ సాధించిన ఘ‌న‌తే. మంత్రి లోకేష్, సీఎం బాబుల తోడ్పాటు చాలా ఉంది. నైపుణ్యాభివృద్ధిలో మేం మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించాం. రాబోయే కాలంలో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల‌లో ప్ర‌థ‌మ స్థానం లో ఉండాల‌న్న‌దే ఆశ‌యం. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుండే ప్ర‌ణాళిక‌ల‌తో రెడీగా ఉన్నామంటున్నారు చౌద‌రి. ఇస్రోలో, బీహెచ్ ఇ ఎల్ కంపెనీలలో ప‌నిచేసిన ఆయ‌న అనూహ్యంగా ఐటీ రంగంలోకి వ‌చ్చారు. దేశంలో గ‌ర్వించ‌ద‌గిన ఇంజ‌నీర్ల‌లో ఆయ‌న ఒక‌రు. అందుకే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఏరికోరి తెచ్చుకున్నారు. కంపెనీల‌ను ఆక‌ర్షించ‌డంలోనే కాదు వాటితో ఎంఓయులు కుదుర్చు కోవ‌డంలో ఏపీ టాప్‌లో ఉంటోంది. ఇదంతా చౌద‌రి వ‌ల్ల‌నే సాధ్యం.

Comments

comments

Share this post

scroll to top