“గీతాంజలి” తరహాలో “అంజలి” మరో హారర్ థ్రిల్లర్ “చిత్రాంగద” హిట్టా?..స్టోరీ, రివ్యూ & రేటింగ్ తెలుగులో

Movie Title: చిత్రాంగద (Chitrangada)

Cast & Crew:

 • నటీనటులు: అంజలి, సప్తగిరి, సాక్షి గులాటి, జయ ప్రకాష్
 • దర్శకుడు: అశోక్
 • సంగీతం: సెల్వ గణేష్
 • నిర్మాత: గంగపట్నం శ్రీధర్

Story:

అరుణ్ బజ్వా మర్డర్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక పబ్ లో డాన్స్ చేస్తూ “అంజలి (చిత్రాంగద)” ఇంట్రడక్షన్. అంజలి ఒక కాలేజీ ప్రొఫెసర్. దయ్యాలు తిరుగుతున్న హాస్టల్ లో ఉంటుంది. అంజలి శరీరంలోకి ప్రవేశించడానికి ఒక ఆత్మప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి అంజలి శరీరం లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ట్రీట్మెంట్ కోసం “అంజలి” అమెరికా కి వెళుతుంది. ఆ తరవాత అంజలి కి ఎలాంటి అనుకోని సమస్యలు వచ్చాయి, అంజలి ఎలా ఎదురుకుంది అనేది తెలియాలి అంటే “చిత్రాంగద” అనే సినిమా చూడాల్సిందే!

Review:

ధైర్యం ఉన్న అమ్మాయిలా “అంజలి” నటన సూపర్. అంజలిని దయ్యం ఆవహించినప్పుడు “సప్తగిరి” తో కామెడీ ట్రాక్ కి థియేటర్ లో నవ్వకుండా ఉండలేము. ఈ సినిమాలోని ట్విస్ట్స్ అయితే అసలు ఊహించలేని విధంగా ఉన్నాయి. టైటిల్ కి తగ్గట్టుగానే హారర్ ఎఫెక్ట్స్ కూడా ఆడియన్స్ ని భయపడేలా చేసాయి. సీరియస్ సన్నివేశాల మధ్యలో వచ్చే పాటలు ఆడియన్స్ ను కథనుండి దారిమరిచేలా ఉన్నాయి!

Plus Points:

 • అంజలి ఆక్టింగ్
 • సినిమాటోగ్రఫీ
 • హారర్ ఎఫెక్ట్స్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సప్తగిరి కామెడీ
 • కథ లో ట్విస్ట్స్
 • దయ్యం మిస్టరీ

Minus Points:

 • సినిమాని ఎక్కువగా సాగతీయకున్నామధ్యలో వచ్చే పాటలు డిస్టర్బన్స్ గా ఉన్నాయి!

Final Verdict:

“గీతాంజలి” తరహాలోనే “అంజలి” కాతాలో మరో హారర్ థ్రిల్లర్. సప్తగిరి కామెడీ కోసం, అంజలి ఆక్టింగ్ కోసం హారర్ సినిమాలు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా “చిత్రాంగద”

AP2TG Rating: 3/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top