ఓ భ‌ర్త అవేద‌న‌.! మీరైతే ఏ స‌ల‌హా ఇస్తారు.!?

నా పేరు అనిల్….2013 లో నావివాహం జ‌రిగింది. పెళ్ళైన మొద‌లు నా జీవితంలో హ్యాపీనెస్ అనేదే లేకుండా పోయింది.!దానికి కార‌ణం నా భార్య‌.! ప్ర‌తిచిన్న విష‌యానికి గొడ‌వ పెట్టుకొని త‌ల్లిగారింటికి వెళ్లేది.! నా మీద మా పేరెంట్స్ మీద లేనిపోనివి క‌ల్పించి పుట్టింట్లో చెప్పేది.! ఇంటికి మా త‌ర‌ఫు బందువులొస్తే చాలు మా ముందే వాళ్ల‌ను కోప‌గించుకునేది.! వారి ముందే మ‌మ్మ‌ల్ని అనేక మాట‌ల‌నేది.! ఏంటిది? ఇలా ఎందుకు చేస్తున్నావ్..అని గ‌ట్టిగా అడిగితే నీ మీద‌, మీ అమ్మానాన్న మీద గృహ‌హింస కేసు పెడ‌తాన‌ని బెదిరిస్తుంది.! ఇక పెళ్ళై నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా…ఇంకా మా ఫ‌స్ట్ నైట్ జ‌ర‌గ‌లేదు.! వాళ్ల పేరెంట్స్ కు చెబితే…అది చిన్న పిల్ల నువ్వే సర్దుకుపో అని చెబుతున్నారు.! ఎన్నో క‌ల‌లు క‌ని పెళ్లి చేసుకున్నాను..కానీ పెళ్లైన ద‌గ్గ‌రి నుండి నాకు ప్ర‌శాంత‌తే లేకుండా పోయింది.! నాలుగేళ్లైతున్నా వీడికి పిల్ల‌లు లేరు అనే మాట‌లు నేను త‌ట్టుకోలేక‌పోతున్న‌.., వీడాకులు ఇవ్వ‌మంటే ఇవ్వ‌దు, సంసారం స‌రిగ్గా చేయ‌దు.! నాకు నా జీవితం మీదే విర‌క్తి పుట్టేలా చేసింది.! ఈ టెన్ష‌న్స్ నుండి బ‌య‌ట‌ప‌డి..ఓ ప్ర‌శాంత జీవితం గ‌డ‌ప‌డానికి నేనేం చేయాలి? ద‌య‌చేసి నాకు స‌ల‌హా ఇవ్వండి.!

Comments

comments

Share this post

scroll to top