ఈ ఏనుగు కోపం వచ్చింది. ఆటోలను, బైక్ లను ఆటవస్తువులుగా విసిరిపారేసింది.

గజరాజుకి కోపం వస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కళ్ళకు కనిపించిన వస్తువులను, ఆటోలు, రిక్షాలు, మోటార్ సైకిల్స్ ఇలా ఏవి కనిపిస్తే వాటిని ఆటవస్తువులుగా విసిరేస్తూ భీబత్సం సృష్టించింది. కేరళ లోని పాలక్కడ్ జిల్లాలో పులప్పట్ట గ్రామంలో గల భగవతి ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు ప్రజలంతా హాజరయ్యారు. ఆనందోత్సాహాల నడుమ ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఇదే ఆలయం వద్ద గజరాజు ఆ వేడుకలను చూస్తోంది. మావటి ఎక్కించిన పిల్లలను తనపై కూర్చోబెట్టుకొని అటూ ఇటు సరదాగా తిప్పుతోంది. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని కాళ్ళకు, కంటికి దగ్గరగా కనిపించిన ప్రతి వాహనాన్ని విసిరికొట్టింది.

అలా తన కోపం తీరెంతవరకు, ప్రశాంతత వచ్చే వరకు  కనిపించిన వాటిని ధ్వంసం చేసింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top