రాజమౌళి శిష్యుడు డైరెక్ట్ చేసిన “ఏంజెల్” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): ఏంజెల్ (Angel)

Cast & Crew:

  • నటీనటులు: నాగ అన్వేష్, హేబా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, సన తదితరులు
  • సంగీతం: భీమ్స్ సెసిరోలియో
  • నిర్మాత: భువన్ సాగర్
  • దర్శకత్వం: ‘బాహుబలి’ పళని

Story:

ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునే ఇద్దరి కుర్రాళ్ళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. దేవలోకం నుండి వచ్చిన ఒక స్టాట్యూ వల్ల వారి జీవితం మలుపు తిరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దివి నుంచి భువికి దిగివచ్చిన ఏంజెల్‌ హీరోకు పరిచయం కావడం ఈ ఏంజెల్ ప్రేమను సాధించడం కోసం దుష్టశక్తులతో పోరాడటం ఈ సినిమా కథ

Review:

ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు నూతన నిర్మాత భువన్ సాగర్. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్, టీజర్‌లకు అనుహ్యమైన స్పందన లభించడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. హీరోగా నాగ అన్వేష్ తన గత చిత్రాలకంటే ఈ మూవీలో కాస్త మెరుగైనట్టు తెలుస్తోంది. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి ‘ఏంజెల్’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన హెబ్బా పటేల్ తన పాత్రకు న్యాయం చేసింది. ఏంజెల్‌ పేరుకు తగ్గట్టే అంద చందాలతో ఆకట్టుకుంది.కథ రోటీన్‌గా అనిపించినప్పటికీ.. సప్తగిరి-హీరోయిన్ మధ్య కామెడీ బాగా పండింది.

Plus Points:

  • హేభ పటేల్ గ్లామర్
  • సప్తగిరి కామెడీ
  • గ్రాఫిక్స్

Minus Points:

  • రొటీన్ స్టోరీ
  • విసుఅల్స్ రిచ్ గా ఉన్నా సరిగా తెరకెక్కించలేక పోయారు

Final Verdict:

సోసియో – ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన “ఏంజెల్” ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది

AP2TG Rating: 2.25 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top