అంగాన్నిపెంచుకుందాం అనుకున్నాడు… గుండె ఆగిపోయింది…

డబ్బుంది కదా అని ఏది పడితే అది జరిగిపోతుంది అనుకోవడం మన భ్రమ. కొన్నిటిని డబ్బుతో కొనలేం. నేను ధనవంతుడిని నేను ఏది అనుకుంటే అదే జరగాలి అని కోరుకోవడం మన తెలివి తక్కువతనం. కానీ అన్ని విషయాల్లోను అది పని చెయ్యదు. చావపను ఆపడం, కొన్నింటిని పెంచడం డబ్బు వల్ల అవ్వదు. ప్రకృతి సిద్ధంగా జరిగేవాటిని మనం డబ్బుతో మార్చలేం. కానీ బెల్జియంకు చెందిన వజ్రాల వ్యాపారి డబ్బు ఉంది కదా అని ఎవరు చేయని ప్రయత్నం చేసి చివరకు మృత్యు ఒడికి చేరుకున్నాడు.


ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… బెల్జియం దేశంలోని ఎహుడ్ ఆర్కే లానియాడో అనే వజ్రాల వ్యాపారి చిన్న స్థాయి నుంచి ఎదిగి కోట్లకు అధిపతి అయ్యాడు. ప్రపంచంలోని అనేక దేశాలకి వజ్రాలను సరఫరా చేసేవాడు. అన్ని విషయాల్లో బాగానే ఉండేది… కానీ శృంగారం విషయంలో మాత్రం చాలా అసంతృప్తి ఉండేది. మొదటి నుంచి కూడా అతని అంగం చిన్నగానే ఉండేది. దీంతో ఎప్పుడూ చాలా నిరాశగా ఉండేవాడు. ఎంతో మందిని సంప్రదించిన అతనికి కరి సలహా మేరకు ఫ్రాన్స్ లో అతని సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిసి అక్కడికి బయల్దేరాడు.
పురుషాంగం పెంచుకునేందుకు సిద్ధమయ్యాడు. వైద్యులు కూడా పూర్తి భరోసా ఇవ్వడంతో అతడు ఆపరేషన్ కు సిద్ధమయ్యాడు. ఆపరేషన్ ధియేటర్ కూడా సిద్ధం చేసారు. మరో ఐదు గంటల్లో అతనికి ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అతడికి సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వైద్యులు మందులు ఇచ్చి నయం చేద్దామని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆపరేషన్ మధ్యలోనే గుండె పోటుతో మరణించాడు. ఆపరేషన్ సమయంలో బాగా ఉద్విగ్నానికి లోనవడంతో గుండె పోటు వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
మనం మార్చలేనివి, మనం కొనలేనివి డబ్బుతో కొనాలని ప్రయత్నించాలని చూస్తే ఇలానే ఉంటుంది. ఒకటి పెంచుకోబోయాడు… అది మొత్తం ప్రాణానికే ఎసరు పెట్టింది.

Comments

comments

Share this post

scroll to top