ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ల‌ను త‌ల‌ద‌న్నే సూపర్ స్మార్ట్‌ఫోన్లు వ‌స్తున్నాయ‌ట‌..!

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌… ఇవి రెండూ ఇప్పుడు అత్య‌ధిక ఫోన్ల‌లో ఉన్న మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌. మార్కెట్‌లో ఈ డివైస్‌ల వాటా 90 శాతానికి పైగానే ఉంది. ఎన్నో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు, డిజైన్లు, యాప్స్‌తో ఆండ్రాయిడ్‌, ఐఫోన్స్ ఇప్పుడు వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. మ‌రీ వీటికి చెందిన హై ఎండ్ డివైస్‌ల‌లో ఉన్న ఫీచ‌ర్ల‌యితే వాటిని మాటల్లో వర్ణించ‌లేం. అంత‌గా అవి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్  మోడ‌ల్స్ అన్నింటినీ త‌ల‌ద‌న్నే రీతిలో సూప‌ర్ స్మార్ట్‌ఫోన్లు త్వ‌ర‌లో రాబోతున్నాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే అవి, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్టమ్‌తో కాదు, వేరే కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో యూజ‌ర్ల‌కు ల‌భించ‌నున్నాయి.

andy-rubin-smart-phones
ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్టమ్ ను రూపొందించిన యాండీ రూబిన్ తెలుసుగా. అత‌ను 2005లో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్‌కు అమ్మాడు. ఆ త‌రువాత అందులోనే ప‌ని చేసి మొన్నా మ‌ధ్య అంటే 2 ఏళ్ల కింద‌ట అందులో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. ఈ క్ర‌మంలో యాండీ రూబిన్ సొంతంగా ప్లే గ్రౌండ్ గ్లోబ‌ల్ అనే ఓ స్టార్ట‌ప్ సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. 2015 న‌వంబ‌ర్‌లో ఎసెన్షియ‌ల్ ప్రోడ‌క్ట్స్ ఇన్ కార్పొరేట్ అనే సంస్థను కూడా స్థాపించాడు. అయితే ఈయ‌న ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్ మోడ‌ల్స్‌ను త‌ల‌ద‌న్నే రీతిలో ఓ కొత్త త‌ర‌హా మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో కూడిన సూప‌ర్‌ స్మార్ట్‌ఫోన్ల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నాడ‌ట‌. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. మిడ్ రేంజ్‌, హై రేంజ్ ఫోన్ల‌ను ఈయ‌న త‌న కంపెనీ ద్వారా మార్కెట్‌లోకి తేనున్న‌ట్టు తెలిసింది.

యాండీ రూబిన్ కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను తీసుకురానున్నాడ‌ని తెలియ‌డంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్ త‌యారీ సంస్థ‌ల‌కు ఇప్పుడు ఒకింత ఆందోళ‌న‌గానే ఉంద‌ట‌. ఎందుకంటే ఆ ఫోన్లు ఇంత‌కు ముందెన్న‌డూ లేని ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు క‌ల్పించ‌నున్నాయ‌ని చూచాయ‌గా తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఆ కొత్త త‌రహా ఫోన్లు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే దానికంటే కూడా అవి ఏ మేర యూజ‌ర్లను ఆక‌ట్టుకుంటాయి, తమ మార్కెట్ ప‌రిస్థితి ఏమిటి అని ఆండ్రాయిడ్‌, ఐఫోన్ త‌యారీదారులు ఆలోచిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే నోకియా కంపెనీ స్మార్ట్‌ఫోన్ త‌యారీ మార్కెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేయ‌డం, ఇప్పుడీ కొత్త కంపెనీ వార్త‌ల‌తో ఇత‌ర ఫోన్ త‌యారీ సంస్థ‌ల‌కు గుండెల్లో గుబుల‌వుతోంద‌ట‌. మ‌రి ఆయా సంస్థ‌లు త‌మ తమ ఫోన్ల అమ్మ‌కాల‌ను పెంచుకోవాలంటే ఏం  చేస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా అలాంటి కొత్త త‌ర‌హా వినూత్న స్మార్ట్‌ఫోన్లు వ‌స్తున్నాయంటే యూజ‌ర్ల‌కు మాత్రం పండ‌గే క‌దా..! ఇక అవి ఎప్పుడు వ‌స్తాయో… అప్ప‌టి దాకా ఆస‌క్తిగా ఎదురు చూడ‌డ‌మే మన ప‌ని..!

Comments

comments

Share this post

scroll to top