ఆ వీడియోలో ఉన్న విధంగా తనతో చేయాలని బలవంతపెట్టిన భర్త.! తట్టుకోలేక భార్య వైఫై ఆఫ్ చేసేసరికి.?

మొన్నీ మ‌ధ్యే వ‌చ్చిన ఒక వార్త గుర్తుంది క‌దా. భ‌ర్త ఫోన్‌లో ఇంట‌ర్నెట్ చూస్తున్న‌ప్పుడు అత‌ని భార్య వైఫై ఆఫ్ చేయ‌గా కోపోద్రిక్తుడైన భ‌ర్త ఆమెను దారుణంగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడ‌ని. దీంతో ఈ వార్త పెద్ద సంచల‌న‌మే అయింది. స‌ద‌రు వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేయ‌గా ప‌లు షాకింగ్ విష‌యాలు తెలిశాయి. నిజానికి అత‌ను ఓ అశ్లీల లోలుడు అట‌. ఫోన్ల‌లో ఎప్పుడూ అశ్లీల వీడియోలు చూస్తుంటాడ‌ట‌. ప‌దే ప‌దే వాటిని చూస్తున్నాడ‌ని అత‌ని భార్య ఇంట్లో వైఫై ఆఫ్ చేసింది. దీంతో అత‌ను ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు.

హైద‌రాబాద్ దుండిగల్‌లో నివసిస్తున్న ఉమర్‌ పాషాకు ఎంఎస్‌ మక్తా నివాసి షబానా బేగం కుమార్తె రేష్మా సుల్తానాకు ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ ఆడ‌పిల్ల‌లే. దీంతో త‌న‌కు ఆడపిల్లలు పుట్టారని కొంతకాలంగా పాషా భార్యను వేధిస్తున్నాడు. ఆమెపై అయిష్టత‌ వ్యక్తం చేసిన అతడు ఓ కుమార్తెను బంధువుకు దత్తత ఇచ్చాడు. ఈ క్ర‌మంలో రేష్మా తల్లిదండ్రులను ఇంటికి రానివ్వకుండా ఆంక్షలు విధించాడు. దీంతోపాటు భార్యను రోజూ హింసించేవాడు. గతంలో రెండుసార్లు తీవ్రంగా కొడితే పెద్దల సమక్షంలో సర్దిచెప్పారు. అయిన‌ప్ప‌టికీ పాషా బుద్ధి మాత్రం మార‌లేదు. భార్య‌ను రోజూ చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తూనే ఉన్నాడు.

తన భ‌ర్త పెడుతున్న హింస‌ను రేష్మా త‌ట్టుకుంది. స‌ర్దుకుపోయి జీవిస్తోంది. అయితే ఈ నెల 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు ఇంట్లో ఉన్న పాషా త‌న ఫోన్‌లో అశ్లీల వీడియోల‌ను చూస్తూ త‌న భార్య రేష్మాను కూడా అలాగే చేయ‌మ‌న్నాడు. దీనికి రేష్మా అంగీక‌రించ‌లేదు. భ‌ర్త మాట విన‌డం లేద‌ని భావించి ఆమె ఇంట్లో ఉన్న వైఫై నెట్ క‌నెక్ష‌న్‌ను ఆఫ్ చేసింది. దీంతో రెచ్చిపోయిన పాషా రేష్మాపై పాశ‌వికంగా దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొట్టాడు. త‌రువాత ఆమె సొమ్మ‌సిల్లి ప‌డిపోయే స‌రికి ఆటోలో ఆమెను తీసుకెళ్లి త‌న త‌ల్లి ఇంటి ద‌గ్గ‌ర బ‌య‌ట ప‌డేసి డోర్ కొట్టి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

బ‌య‌ట‌కు వ‌చ్చి చూసిన రేష్మా త‌ల్లిదండ్రుల‌కు త‌మ కూతురు ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింది. అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆమెను వారు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. ఈ క్ర‌మంలో రేష్మా త‌న భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు పాషాపై హ‌త్యాయత్నం కేసు న‌మోదు చేశారు. త‌న భ‌ర్త నుంచి విడాకుల‌ను ఇప్పించాల‌ని రేష్మా కోర‌డంతోపాటు త‌న పిల్ల‌ల‌ను త‌న వ‌ద్ద‌కే పంపాల‌ని ఆమె అడిగింది. దీంతో పోలీసులు ఆమెకు స‌హ‌కారం అందించారు. పిల్ల‌ల‌ను ఆమె వ‌ద్ద‌కు చేర్చారు. ఇక ప్ర‌స్తుతం ఆ ప్ర‌బుద్ధుడు పాషా క‌ట‌క‌టాల వెనుక ఊచ‌లు లెక్క‌బెడుతున్నాడు. ఇక ఇప్పుడు మీరే చెప్పండి.. ఇలాంటి మృగాళ్ల‌ను ఏం చేయాలో. నిజంగా వీరికైతే స‌మాజంలో తోటి మ‌నుషుల మ‌ధ్య జీవించే హక్కు అయితే లేదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top