“బిగ్ బాస్” షోలో కనిపించనున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె ఎంత తీసుకుంటుందో తెలుసా..?

మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో టీవీలో ప్రసారం కాబోతోంది. 12 మంది కంటెస్టెంట్లుండే ఈ షోలో పాల్గొనే సెలెబ్రిటీలు ఎవరన్నది ఇప్పటిదాకా తెలియదు. పోసాని బిగ్ బాస్‌లో కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చినా.. అదేం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా పేరు వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన ఈషా చేసింది కొన్ని సినిమాలే. ఇటీవలే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన అమీతుమీ సినిమాలో నటించింది. ఇప్పటికే చాలా మందికి ఆడిషన్స్ స్క్రీనింగ్ నిర్వహించినా.. ఏ ఒక్కరినీ అధికారికంగా ప్రకటించలేదు.

అయితే.. ఈషా మాత్రం బిగ్ బాస్ షోలో పాల్గొనడం పక్కా అని చెబుతున్నారు. రోజుకు రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అంటే డబ్బై రోజుల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే షో కోసం రూ.70 లక్షలు తీసుకోబోతోందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అసలు ఎవరెవరు ఈ షోలో పాల్గొంటున్నారన్నది అధికారికంగా వెల్లడి కాలేదు కాబట్టి.. ఈషా కూడా అందులో పాల్గొంటోందా..? లేదా..? ఎవరెవరు పోటీ పడుతున్నారు..? అన్నది తెలియాలంటే జూలై 16వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఆమె దర్శకుడు, వస్తా నీ వెనక అనే సినిమాల్లో నటిస్తున్నారు. కాగా, బిగ్ బాస్ షోలో తెలుగు బాగా మాట్లాడే వారినే తీసుకునేలా చూస్తున్నారట. షోకు సెలెక్ట్ అవ్వాలంటే అదే ప్రధాన అర్హత అని చెబుతున్నారట.

Comments

comments

Share this post

scroll to top