వెబ్ సైట్ నుండి “హాల్ టికెట్” డౌన్లోడ్ చేసింది.! అందులో “అర్ధ నగ్న” ఫోటో చూసి ఆ విద్యార్థిని షాక్.!

ఎగ్జామ్స్ ద‌గ్గ‌రికొచ్చేశాయి.. బాగా ప్రిపేర్ అయ్యారు.. ఎగ్జామ్ సెంట‌ర్ చూసుకున్నారు.. ఇక హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డ‌మే త‌రువాయి.. ప‌ని అంతా అయిపోయిన‌ట్టే.. అయితే అంతా మ‌నం అనుకున్న‌ట్లే జ‌రిగితే ఏం బాగుంటుంది.. హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక అందులో మ‌న ఫొటో కాకుండా వేరే ఏదైనా ఫొటో వ‌స్తే.. అప్పుడు మ‌న‌కు ఎలాంటి బాధ క‌లుగుతుందో తెలుసు క‌దా. స‌రిగ్గా ఆ విద్యార్థిని కూడా అదే త‌ర‌హాలో ఇబ్బందికి లోనైంది. త‌న హాల్ టిక్కెట్‌లో త‌న ఫొటోకు బ‌దులుగా వేరే మ‌హిళ ఫొటో, అది కూడా అర్ధ‌న‌గ్నంగా బికినీతో ఉన్న ఫొటో ప్రింట్ అయి వ‌చ్చింది. దీంతో ఆ విద్యార్థిని ప‌డ్డ అవ‌స్థ అంతా ఇంతా కాదు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

పాట్నా మధుబానిలోని ఎస్‌ఎమ్‌జే కాలేజీలో ఓ విద్యార్థిని సైన్స్ గ్రూపులో ఫైనలియర్ చదువుతోంది. మిథిలా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న‌ నేపథ్యంలో యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి తన హాల్‌టికెట్‌ను ఆమె డౌన్‌లోడ్ చేసుకుంది. అయితే ఆ హాల్‌టికెట్‌లో తన ఫోటోకు బదులుగా బికినీ ధరించి ఉన్న మరో మహిళ ఫోటో ముద్రించి ఉండ‌డాన్ని చూసి ఆ విద్యార్థిని విస్తుపోయింది. ఆమె ఒక్క‌సారిగా షాక్ కు గురైంది.

త‌రువాత ఆ విద్యార్థిని ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా బాధిత విద్యార్థిని మాట్లాడుతూ.. తాను త‌న‌ హాల్ టికెట్ ను చూసి షాక్ అయ్యాన‌ని, తాను ఎగ్జామ్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు తన ఫోటోనే అప్‌లోడ్ చేశానని తెలిపింది. కానీ వ‌ర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తప్పిదం జరిగిందని ఆమె తెలియ‌జేసింది. దీంతో యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కుల్‌నంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించి బాధిత విద్యార్థినికి కొత్త హాల్‌టికెట్‌ను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే గతేడాది అక్టోబర్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫస్టియర్ బీకామ్ విద్యార్థి ఫోటోకు బదులుగా అత‌ని హాల్‌టికెట్‌లో వినాయకుడి బొమ్మను ముద్రించారు. ఆన్‌లైన్‌లో జరిగే తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవును మ‌రి.. హాల్ టిక్కెట్ ఫొటోల‌ను అప్‌లోడ్ చేసే స‌మ‌యంలో వేరే ఏ వెబ్‌సైట్‌ను చూడ‌కుండా ప‌నిచేస్తే స‌రిగ్గానే ఉంటుంది. లేదంటే బికినీ బొమ్మ‌లు ఏంటీ.. పోర్న్ బొమ్మ‌లు కూడా వ‌స్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Comments

comments

Share this post

scroll to top