మొన్నేమో “సుచి లీక్స్” లో ఇరుక్కుంది..ఇప్పుడేమో “లిప్ – లాక్” వివాదంలో ఇరుక్కుంది..! అసలు ఏమైంది?

సిద్దార్ధ్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా మిలింద్ దర్శకత్వంలో హీరో సిద్దార్థే నిర్మించిన చిత్రం గృహం. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచమంతా విడుదల కాబోతుంది. ఆ సందర్భంగా హీరోయిన్ ఆండ్రియా మీడియాకి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. అంతేకాకుండా సినిమా చూసిన వారంతా భయపడతారని, గృహం భయపెడుతుందని ఆమె తెలిపారు. అయితే ఈ సినిమాలో లిప్‌లాక్ దంచేసినట్లున్నారని అడిగిన మీడియాకి ఆమె దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.

watch video here:


”మీరెవ్వరూ ఎప్పుడూ, ఎవరికీ ముద్దు పెట్టలేదా! మీకసలు ముద్దు అంటేనే తెలియదా? మీ ఇళ్లలో భార్యాభర్తలు ముద్దులు పెట్టుకోరా? ప్రేమగా ఉండరా?” అంటూ ఆమె ముద్దు గురించి పెద్ద ఉపన్యాసమే ఇచ్చేశారు. టెక్నాలజీ డెవలప్ అయిన నేటి రోజుల్లో కూడా.. ముద్దు గురించి అడుగుతున్నారేంటి? అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ.. ”ప్రస్తుత ప్రేమ ప్రపంచం ఎలా ఉందో తెలియదా? పబ్లిక్‌గా, పార్క్‌లలో ముద్దులు పెట్టుకోవడం లేదా?” అంటూ ముద్దు గురించి మరోసారి మాట్లాడకుండా.. ‘ఇడియట్ సినిమాలో రవితేజ చెప్పే కమీషనర్ కూతుళ్లకి..’ డైలాగ్‌ తరహాలో సమాధానం ఇచ్చింది ఈ గడుసరి భామ.

Comments

comments

Share this post

scroll to top