“ఆంధ్రప్రదేశ్” ప్రబుత్వంకి బదులుగా ప్రెస్ నోట్ లో ఏమని ప్రింట్ అయ్యిందో తెలుసా.? చూస్తే ఆశ్చర్యపోతారు!

ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాకు ఎంతో పవర్ఫుల్ ..కాని నేటి తరుణంలో ఒక్కో పత్రిక ఒక్కో పార్టి కరపత్రంగా మాత్రమే పనిచేస్తున్నాయి అనే మాట వినిపిస్తుంది..ప్రజలకు ఏం అవసరమో ఆ న్యూస్ కాకుండా,ఏ వార్త ప్రచురిస్తే పార్టికి పబ్లిసిటి వస్తుందో ఆ విధంగా ముందుకుపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి..ముఖ్యంగా ఒకట్రెండు పత్రికల గురించైతే ఈ విమర్శలు పబ్లిగ్గానే జరుగుతుంటాయి.అలాంటి మాటలకు ఊతమిచ్చేలా ప్రవర్తించింది ఇఫ్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?

కడప జిల్లా సమాచార కమిషన్ ద్వారా విడుదలైన దేవాదాయ శాఖ ప్రెస్ నోట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని రావాల్సిన చోట.. ఆంధ్రజ్యోతి ప్రభుత్వం అని రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రెస్ నోట్ వైపే మళ్లింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉండాల్సిన చోట ఆంధ్రజ్యోతి ప్రభుత్వం ఉండటం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు విమర్శిస్తున్నారు. అమరావతి నుంచి వచ్చిన ఈ ప్రెస్ నోట్‌ను యథాతథంగా పత్రికలకు పంపామని అధికారులు చెబుతున్నారు.అసెంబ్లీ సమావేశాల ప్రసారాలతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రసార హక్కులను ఓ న్యూస్ ఏజెన్సీ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం బయటకు వచ్చిన ప్రెస్ నోట్ కూడా ఆ మీడియా సంస్థ నుంచే వెళ్లినట్లు విమర్శలు వస్తున్నాయి.దీంతో బాబు సర్కారుపై విమర్శలు చుట్టుముడుతున్నాయి..

Comments

comments

Share this post

scroll to top