పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల… పరీక్షలు బాగా రాయాలంటే ఏం చెయ్యాలి..!!

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. . ఈ నెల 7 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు, ఈ సంవత్సరం దాదాపు 6.10 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్‌ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. పదవ తరగతి పరీక్షలు ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు…

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌..:

18/03/2019 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-1
19/03/2019 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-2
20/03/2019 సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
22/03/2019 ఇంగ్లీష్‌ పేపర్‌-1
23/03/2019 ఇంగ్లీష్‌ పేపర్‌-2
25/03/2019 మ్యాథ్స్‌ పేపర్‌-1
26/03/2019 మ్యాథ్స్‌ పేపర్‌-2
27/03/2019 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1
28/03/2019 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2
29/03/2019 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1
30/03/2019 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2

పరీక్షలు బాగా రాయాలంటే… :

పదో తరగతి పరీక్షలు రాసే వారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ముఖ్యంగా మొదటి సారి రాసే పిల్లోళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు, టెన్షన్ ని దరికి రానివ్వకండి, బాగా వచ్చిన సబ్జెక్టు ల పైన తక్కువ శ్రద్ధ పెట్టి, సరిగ్గా రాని సబ్జెక్టు ల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈ నెల రోజులు అన్నిట్టిని పక్కన పెట్టి చదువు మీద ద్యాస ఉంచండి, రోజుకి ఒక గంట స్పోర్ట్స్ ఆడండి, మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ కి ఈ నెల రోజులు దూరంగా ఉండండి, పరీక్షల ముందే సిలబస్ లో ఏ డౌట్స్ లేకుండా క్లారిఫై చేసుకోండి. రాసేటప్పుడు నమ్మాకంగా ఉండండి. ఒక పరీక్ష సరిగ్గా రాయలేదని మనోధైర్యాన్ని కోల్పోకుండా, తరువాతి పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ పడటం లోనే పడటం ఉంది. కనుక జాగ్రత్తగా సంతోషంగా పరీక్షలు రాయండి.

 

Comments

comments

Share this post

scroll to top