హీరోయిన్ లాగా కనిపించాలని ఆమె 50 ఫేస్ సర్జరీలు చేయించుకుంది..చివరికి ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు!

మనలో చాలామందికి అభిమాన హీరోలు,హీరోయిన్లు ఉంటారు..వారిపై అభిమానంతో వారు సినిమాల్లో ఏ స్టైల్స్ ఫాలో అయితే మనమూ అదే ఫాలో అవడం చేస్తుంటాం..ఉదాహరణకు డ్రెస్సింగ్,హెయిర్ స్టైల్స్,గడ్డం,టాటూస్ ఇలా వారు ఏ విధంగా రెడీ అయితే మనం కూడా అదే విధంగా రెడీ అయి అందంగా కనిపించాలనుకుంటాం..కానీ ఒక అమ్మాయి తన అభిమాన నటిపైన పిచ్చిప్రేమతో పూర్తిగా తనలా మారాలనుకుంది…దానికోసం  ఆమె ఏంచేసింది..ఇప్పుడు ఎలా ఉందో చూస్తో షాక్ అవుతారు..

ఏంజెలినా జోలి హాలివుడ్ స్టార్..తనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు..అలాంటి అభిమానుల్లో ఒకమ్మాయే సహర్ ..ఈమెది ఇరాన్..సహర్ ,ఏంజెలినాపై పిచ్చి అభిమానంతో ,అచ్చం ఏంజేలినా లా కనపడాలని ఆరాటపడేది..దానికోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించింది..ఇప్పటివరకూ ముఖానికి 50 సర్జరీలు చేయించుకుంది సహర్..అంతేకాదు, 40కేజీలకు మించి పెరగకుండా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ వస్తోంది. .. సర్జరీకి  ముందు, తరువాత ఎలా తయారయ్యానో చూడండి అంటూ ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నాయి.

కొందరైతే, చనిపోయాక మంత్రగత్తె బతికించిన శవంలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.సహర్ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.. ఇప్పటివరకూ ఆమెను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3,25,000మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ సంఖ్య ప్రతీ నిమిషానికి పెరుగుతూనే ఉంది. .వీటన్నింటి ఫలితంగా ఆమె ఇప్పుడెంత దారుణంగా తయారైందో ఫోటోల్లో చూడవచ్చు. ఒకప్పటి ఆమె ఫోటోకు, ఇప్పుడున్న అవతారానికి అసలు పోలికే లేదు..

Comments

comments

Share this post

scroll to top