మన దేశంలో బ్యాంక్ ల టైం ఏం బాగా నడుస్తున్నట్టు లేదు..కోట్లకుకోట్లు లోన్లు తీసుకుని వాటిని పంగనామం పెట్టి విధేశాలకు చెక్కేస్తున్న వ్యాపారస్థులెందరో.. మామూలు ప్రజలు అడిగితే సవాలక్ష కారణాలు,రకరకాల డాక్యుమెంట్లు అడుగుతారు..వీళ్లకెలా ఇస్తారు అంటూ సామాన్య జనం బ్యాంకుల మీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.తాజాగా ఒక సినిమా హీరోయిన్ పైన ఛీటింగ్ కేసు నమోదైంది..
చందమామ సినిమాలో నటించిన సిందు మీనన్ గుర్తుందా..ఆ సినిమాలో తన అల్లరితో అందరిని ఆకట్టుకుంది.ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది..తమిళ్లో వచ్చిన వైశాలి సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా విజయం సాధించింది..సినిమాల తర్వాత ఓ ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడింది.అయితే ఇటీవల ఈ అమ్మడు ఛీటింగ్ కేసులో చిక్కుకుంది..సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడు.
ఇందుకు సింధు మూడో గ్యారంటర్‌గా ఉంది. అయితే, చాలా రోజుల నుంచి రుణం చెల్లించకపోగా, నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరుడిపైనా బెంగళూరులోని ఆర్ఎంసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు సింధు సోదరుడు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై సింధు మీనన్ కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆమె విదేశాల్లో ఉండడంతో అరెస్ట్ చేయడానికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు..