ఈ టీవీ లో వచ్చే ఆ షో పై ఫైర్ అయిన “యాంకర్ శ్యామల”.! అందుకే తను అందులో చేయలేదంట?

ప్రముఖ చానల్ లో వచ్చే ‘పటాస్’ పై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో లో బూతు కంటెంట్ ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో మేల్, ఫిమేల్ యాంకర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, యువతను చెడు దారి పట్టించే విధంగా ఈ షో ఉందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పటాస్ వంటి టీవీ షోస్ ను తాను చేయలేనని యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, అటువంటి షోస్ గోదావరి జిల్లాలకు చెందిన తనకు పడవని అంది. ఇతరులను గౌరవించకుండా పిలవడం తనకు చేతకాదని, గోదావరి ప్రజలకు అలవాటైన ‘అండి’, ‘గారు’ వంటి పదాలు వాడకుండా తాను మాట్లాడలేనని చెప్పింది.

అందువల్ల అటువంటి షోస్ తాను చేయలేనని చెప్పుకొచ్చింది. ఒరేయ్, వాడు, నీ యంకమ్మ వంటి మాటలను మాట్లాడలేనని చెప్పింది. కొన్ని ఆడియో ఫంక్షన్లలో తాను ధరించిన దుస్తులపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, వేసుకునే దుస్తులపై నిర్ణయం తానే తీసుకుంటానని, మరెవరి ప్రమేయం ఉండదని శ్యామల వెల్లడించింది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చాలెంజ్ గా అనిపిస్తుందని తెలిపింది.

Comments

comments

Share this post

scroll to top