సుమ నెల‌కు సంపాధ‌న ఎంత‌? మ‌ల‌యాలీ అయిన సుమ‌కు తెలుగు ఇంత బాగా రావ‌డానికి కార‌ణం ఎవ‌రు??

ఇప్పుడు యాంకర్లు అనగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది..వంకర టింకర తెలుగు,సంభందంలేని హావ భావాలు ..అందరూ అదే విధంగా ఉన్నారా అంటే కాదనే ఆన్సరే వస్తుంది..సుమ,ఝాన్సీ,ఉదయభాను,అనితా చౌదరీ,శిల్పా చక్రవర్తి ఇలా యాంకరింగ్ కి వన్నెతెచ్చారు.చిన్నా,పెద్దా అందరిని ఆకట్టుకుంటున్నారు.వారిలో సుమ ని బుల్లితెర యాంకరింగ్ కి మకుటం లేని మహరాణి అని చెప్పవచ్చు..అంతలా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించారు..

తెలుగులో గలగల మాట్లాడుతున్న సుమ జన్మత: తెలుగు అమ్మాయి కాదు..మళయాలి..తండ్రి P N కుట్టి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావటంతో కుటుంబం కూడా ఇక్కడే స్థిరపడాల్సివచ్చింది.సుమ తల్లి విమల సుమ యాంకర్ గా రాణించడానికి,సుమకి తెలుగు పట్ల మక్కువ కలగడానికి తల్లి ప్రోత్సాహమే కారణం అని చెప్పాలి.అందరితోనూ యాంకర్ సుమగా పిలిపించుకుంటున్న ఈమె గతంలో సీరియల్స్ సినిమాలలో నటించింది .బుల్లితెర నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాఖ్యాతగా ఎదిగి సినీనటిగా కొన్ని పాత్రలను పోషించి హీరొయిన్ గ కళ్యానప్రాప్తిరస్తు సినిమాలో హీరొయిన్ గ నటించి సిని నట జీవితానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయి బుల్లితెర వ్యాఖ్యాతగా సినీ ఆడియో ఫంక్షన్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నది..

1999 ఫిబ్రవరి 10 న ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ను పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిచేసుకున్నారు .వీరికి రోషన్ అనే కుమారుడు మనస్విని అనే కుమార్తె ఉంది . సుమ కనకాల జన్మతః మలయాళీ అయినా తెలుగులొ అనర్గలంగా మాట్లాడగల సత్తా ఉన్న ఏకైక యాంకర్ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.పెళ్లి,పిల్లలు పుట్టాక మళ్లీ కెరీర్ స్టార్ట్ చేద్దామనుకున్న సుమకి,అప్పటికే ఇక్కడ కొత్త యాంకర్లు వచ్చి ఉండడంతో అవకాశాలు రాలేదు.మామ దేవదాసు కనకాల,భర్త రాజీవ్ కనకాల పేర్లు ఉపయోగించుకుని ఆమె అవకాశాలు తెచ్చుకోవచ్చు కానీ తన బ్యాక్ గ్రౌండ్ చూసి కాదు తన టాలెంట్ చూసి అవకాశాలు రావాలని కోరుకున్న సుమ..విజయవాడ వెళ్లి అక్కడ లోకల్ ఛానెల్స్ లో మళ్లీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.పడిలేచిన కెరటం అనేదానికి సుమ నిలువెత్తు నిదర్శనం. అలాంటి సత్తా ఉన్న సుమ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపడుతారు.ఒక టాప్ హీరోయిన్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో సుమ  తన టీవి షో లు ఆడియో ఫంక్షన్స్ అన్నిటికి కలిపి రెండు రెట్లు ఎక్కువగా సంపాదిస్తుంది. ఈమె నెలకు 30 లక్షలదాకా సంపాదిస్తుందట. ఈ మద్య కొన్ని టీవి షోస్ కి నిర్మాతగా మారి మరింత డబ్బును సంపాదిస్తుంది.

సుమ ఇప్పుడు ఇంత సంపాదించొచ్చు కానీ ఒకప్పుడు తను పడిన కష్టమే తనని ఇప్పుడు ఈ స్థానంలో ఉంచింది. కష్టే ఫలి అని పెద్దలు ఊరికే అన్లేదు.

Comments

comments

Share this post

scroll to top