చిక్కుల్లో పడిన యాంకర్ రష్మీ. వ్యక్తి ని ఢీ కొన్న రష్మీ కార్, పరిస్థితి విషమం.

అందాల తార, బుల్లితెర మహారాణి రష్మీ గౌతమ్ చిక్కుల్లో పడింది, తన అంద చందాలతో జబర్దస్త్ షో యాంకర్ గా బుల్లితెర జనాలను ఆకట్టుకుంది, ఆ తరువాత పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించింది, సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. గుంటూరు టాకీస్ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది, రష్మీ ఏ విషయాన్ని అయినా ధైర్యంగా ఎదురుకుంటుంది, కానీ రష్మీ మొదటి సారి టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె ప్రయాణిస్తున్న కార్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొనడం తో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకెళితే విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్మి కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ సంఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగింది, బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

పరిస్థితి విషమం అవ్వడంతో.. :

బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించినట్టు సమాచారం. ఈ ఘటన వల్ల రష్మీ ఇబ్బందుల్లో పడుతుందని చాలా మంది చెబుతున్నారు. అయితే ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వలన ఆమెకు పెద్దగా ఇబ్బందులు ఉండవని మరికొందరు అంటున్నారు. బాధితుడి పరిస్థితి ఇంకా విషమం గానే ఉండటం తో రష్మీ ఇంకా టెన్షన్ పడుతూనే ఉందని సమాచారం. బాధితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Comments

comments

Share this post

scroll to top