హైదరాబాద్ లో దారుణం: ఆఫీస్ నుండి రాగానే ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్.! లెటర్ లో ఏముందంటే.?

ప్రముఖ తెలుగు టెలివిజన్ చానల్‌ న్యూస్ యాంకర్‌ రాధిక (30) ఆదివారం రాత్రి తాను నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విధుల నుంచి వచ్చిన కొద్ది సేపటికే మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆమె బలవన్మరణం పొందారు. మానసిక ఒత్తిడితోనే యాంకర్ రాధిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలిలో సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాధికకు వివాహమైన పదేళ్ల అవుతుండగా, ఆరు నెలల కిందటే భర్తతో విడిపోయినట్టు సమాచారం. అతడి నుంచి విడాకులు తీసుకున్న రాధిక తన కుమారుడు, తండ్రి, చెల్లెలతో కలిసి మూసాపేట్‌ గూడ్స్‌షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. గత ఐదేళ్ల నుంచి ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న రాధిక, భర్త దూరం కావడంతోపాటు కొడుకు కూడా మానసికంగా ఎదగకపోవడంతో కలత చెందినట్టు సమాచారం.

దీంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఆఫీసు నుంచి వచ్చిన కాసేపటికే అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి తనువు చాలించారు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న రాధిక కొద్ది సేపటికే, పరుగుపరుగున అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. ఏదో కీడు శంకించడంతో వారు కూడా పైకి వెళ్లేలోపే రాధిక పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు మరేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉందని కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు పేర్కొన్నారు.

Comments

comments

Share this post

scroll to top