“డ్రంక్ అండ్ డ్రైవ్” లో పట్టుపడ్డ “యాంకర్ ప్రదీప్” గురించి అతని తల్లి షాకింగ్ నిజం చెప్పిందంట.! అప్పటినుండే మద్యం సేవించి?

న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి కారు నడిపి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు మరో కేసు న‌మోదు చేయ‌నున్నారు.! మ‌ద్యం తాగి కార్ ను డ్రైవ్ చేసిన నేరంతో పాటు … ప్రదీప్ కార్ అద్దాల‌కు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దానిపై కూడా మరో కేసు న‌మోదు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం ! రూల్స్ ప్రకారం బ్రీత్ ఎన‌లైజ‌ర్ లో 150 పాయింట్లు వస్తేనే రెండు రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అలాంటిది ప్రదీప్‌కు ఏకంగా 178 పాయింట్లు రావడంతో వారం రోజుల జైలుశిక్ష పడవచ్చని సమాచారం.! దీంతో పాటు జ‌రిమానా కూడా భారీగా విధించే అవ‌కాశముంది.

ఈ విషయం తెలిసిన ప్రదీప్ తల్లి తీవ్ర మ‌న‌స్థాపానికి గురి అయిందట. ప్రదీప్ టీవీ రంగానికి రాక ముందు ఎటువంటి మందు అలవాటు లేదని…టీవీ రంగానికి వచ్చాకే కొద్దిగా మద్యం తీసుకొనేవాడని…ఆ అలవాటు కాస్త ఇంతదాకా తీసుకువచ్చిందని ఆమె చాలా బాధగా ఉందట. ఆమె ప్రదీప్ ని మద్యం జోలికి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినకుండా మద్యం సేవిస్తూనే ఉన్నాడని తన సన్నిహితుల వద్ద ప్రదీప్ తల్లి చెప్పి బాధ పడినట్టు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top