కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని “మహిళా సంఘాలు” బెదిరిస్తుంటే…”యాంకర్ రవి” ఏమని స్పందించాడో తెలుసా.?

సీనియర్ నటుడు అన్నాక కొద్దోగొప్పో సంస్కారం ఉండాలి. ఏం మాట్లాడుతున్నాము అని ఒకసారి ఆలోచించాలి. నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా? మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న “చలపతి రావు” చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు మండిపడుతున్నారు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న “రారండోయ్ వేడుక చూద్దాం” అనే సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా “చలపతి రావు” అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నెట్ లో కలకలం రేపింది.పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావులాంటి పరిశ్రమ పెద్దలు అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడడం తగదని కమెంట్‌ చేస్తున్నారు.

సినిమాలోని ట్రైలర్ లో నాగచైతన్య అమ్మాయిలు హానికరం అని ఒక డైలాగ్ అంటదు. ఆ డైలాగ్ ఆధారంగా తీసుకుని యాంకర్ “చలపతి రావు” గారిని “అమ్మాయిల మనశ్శాంతికి హానికరమా?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా “చలపతి రావు” “అమ్మాయిలు హానికరమో లేదో తెలీదు..కానీ పక్కలోకి మాత్రం పనికొస్తారు” అని నీచంగా మాట్లాడారు.

చలపతిరావుపై  మహిళా సంఘం నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. చలపతి రావు పైనే కాదు “యాంకర్ రవి” పై కూడా మండిపడుతున్నారు మహిళా సంఘాలు. చలపతిరావు చేసిన కామెంట్‌కు ‘సూపర్ సర్’ అన్న యాంకర్ రవి తమకు కనిపిస్తే కాళ్లు విడగ్గొడతామని హెచ్చరించారు. రవి యాంకరింగ్ చేసే అన్ని షోలలోకూడా ఆడవాళ్ల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నువ్వు యాంకర్‌గా ఉండాలంటే ఉండు. నీకు ఉన్న టాలెంట్ చూపించు. కానీ ఈ రకమైన కామెంట్లు చేయకు. వాట్ సూపర్?.. నీ తల్లిని అట్లా మాట్లాడితే నువ్వు సూపర్ అంటావా రవి? చెప్పు? ఎవడు వాడు అసలు? వాడి వయసెంత.. వాడు సూపర్ అని మాట్లాడడానికి.”

దీనిపై “యాంకర్ రవి” ఫేస్బుక్ లో స్పందించాడు. తన ఉద్దేశం అది కాదు అని ఏదో కవర్ చేసాడు!

Watch Video Here:


Comments

comments

Share this post

scroll to top