మీరేమైనా కట్టకట్టుకుని కాశ్మీర్ వెళుతున్నారా? నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ?

జబర్దస్త్ యాంకర్, సినీ నటి అనసూయ సోషల్ మీడియా లో ఈ మధ్య హల్చల్ చెయ్యడం మానేశారు. పిల్లోడి చేతిలో ఫోన్ పగలగొట్టాక సోషల్ మీడియా కి కూసింత దూరంగానే ఉన్నారు ఈమె, కానీ ఇటీవల కాలం లో మళ్ళీ ఊపందుకున్నారు. పుల్వామా లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ కు ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం జరగాల్సిందే అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వారి కామెంట్స్ కి బదులిచ్చింది అనసూయ.

మీరు వెళ్లి చేస్తారా.?

‘సోషల్ మీడియా లో రెచ్చగొట్టే కామెంట్స్ తప్ప నిజంగానే యుద్ధం వస్తే మీరు యుద్ధం చెయ్యడానికి వెళ్తారా.? వాళ్ళు అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు, కాశ్మీర్ మంచు లో ఊపిరి పీల్చుకోడానికి కూడా కష్టంగా ఉంటుంది, వాళ్ళు పడే తిప్పల ముందు మనమెంత, ఊరికే యుద్ధం యుద్ధం అని రెచ్చగొట్టడం సరికాదు’ అని అనసూయ తెలిపారు.

మీరంతా కాశ్మీర్ కి వెళ్తారా.. :

‘కొంత మంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత అసహ్యంగా అంటే.. నువ్వు వెళ్లి చిన్న బట్టలు వేసుకుని పని చేసుకో, నీకు టైమ్ అయింది ఫోటోలు పోస్ట్ చేసుకో అంటున్నారు. అలా మాట్లాడే వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇది జరిగిందని మీరు తినడం మానేస్తున్నారా? పడుకోవడం మానేస్తున్నారా? లేదా అందరూ కట్టకట్టుకుని కాశ్మీర్ వెళ్లిపోతున్నారా?’ అని అనసూయ ప్రశ్నించారు.

బిర్యానీ తింటారు.. వాగుతారు..!!

‘దేశం మీద భక్తి ఉన్నట్టు వాగుతారు, తరువాత కడుపు నిండా బిర్యానీ తిని పంటారు, ప్యారెలెల్ గా అందరి జీవితాలు సాగుతూనే ఉంటాయి, మీవైన నాదైన. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, కానీ కరెక్టుగా చేయండి. మీ ఇంట్లో వారిని గౌరవించండి, మీ ఇంట్లో వారిని కూడా మంచి వ్యక్తులుగా తయారు చేయండి’. అని ఆవేదన వ్యక్తం చేసారు అనసూయ.

నేను కేవలం ఎంటర్టైనర్ ఏ..

‘నేను కేవలం ఎంటర్టైనర్ ఏ, మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి మాత్రమే నటిస్తాము, ఆ తరువాత మా జీవితాలు మాకుంటాయి, చేస్తే యుద్ధం చెయ్యండి, లేదా ఊరికే కూర్చోండి. అంతే కానీ కూర్చొని యుద్ధం చెయ్యండి యుద్ధం చెయ్యండి అని వాగకండి అనవసరంగా,’ అని అనసూయ తెలిపారు.

మళ్ళీ బట్టలు..

‘ఎప్పుడు చుసిన నేను వేసుకున్న బట్టల మీద పడతారేంటండి, పొట్టి బట్టలు ఆ బట్టలు అని, నేను ఏ బట్టలు వేసుకుంటే మీకు ఎందుకండి? మీ బుద్ధి ఇంతేనా.? అసలు ఇలాంటి విషయాలకు రిప్లై ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ బాధ ఆపుకోలేక ఇస్తాను’ అని అనసూయ బదులిచ్చారు.

 

Comments

comments

Share this post

scroll to top