రవిశాస్త్రికి బహిరంగ లేఖ.! ఓవర్ కాన్ఫిడెన్స్ Keep It Up & Down.

ఇండియన్ క్రికెట్ టీమ్ కు కోచ్ గా తనను ఎన్నిక చేయలేదని అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ది గ్రేట్ రవిశాస్త్రి గారికి …. క్రికెట్ ను అభిమానించే వ్యక్తిగా నేను రాయునది.

అయ్యా…..! రవిశాస్త్రి గారు, 20 సంవత్సరాలు BCCI బోర్డులో సభ్యులుగా ఉన్న మీరు…మాట్లాడాల్సిన మాటలివేనా? మర్యాదలు మరిచి ప్రత్యక్ష దూషణలకు దిగుతారా? మీ ప్రవర్తనను చూస్తుంటే నేనైతే  మీకు కోచ్ పదవి రానందుకే సంతోషిస్తున్నాను. కేవలం 1 సంవత్సరం పాటు ఉండే కోచ్ పదవికి మిమ్మల్ని ఎంపిక చేయలేదని ఇంత అక్కసు వెల్లగక్కిన మీ పేరును…. రేపు ఫుల్ టైమ్ కోచ్ ఎన్నికప్పుడు అసలు పరిశీలనలోకి తీసుకోకుంటేనే బాగుంటుందిని ఆశిస్తున్నాను.

అయినా ఓ బాధ్యతాయుతమైన పదవి కోసం ఇంటర్వ్యూలు జరుగుతుంటే… మీరు ఆన్ లైన్ లో ప్రజెంటేషన్ ఇచ్చిన దాని బట్టి చూస్తేనే తెలుస్తుంది మీ ఆటిట్యూడ్ ఏంటో..? హా…నన్ను  కాక ఇంకెవర్ని సెలెక్ట్ చేస్తారులే అన్న ఓవర్ కాన్ఫిడెంన్స్ తో  వచ్చిన తలబిరుసులాగుంది మీ వాలకం.

తాత్కాలిక కోచ్ గా ఉన్నప్పుడు కూడా మీరు అంతగా పొడించిందేం లేదు…. కోహ్లీ, ధోనీలకు మధ్య చిచ్చు పెట్టడం తప్ప!  మీ గురించి జనాల్లో ఉన్న టాక్ గురించి చెప్పనా…” కోచ్ కు తక్కువ, కామెంట్రీకి ఎక్కువ” ఇలా ఉంది సార్ మీ మీద జనాల ఒపీనియన్.  కావొచ్చు….టీమ్ ఇండియా జట్టుకు మీరు డైరెక్టర్ గా పనిచేసి ఉండొచ్చు, 20 యేళ్లు క్రికెట్ కు సేవ చేసి ఉండొచ్చు, కానీ ఇవే కోచ్ పదవికి కొలమానాలైతే…మీకంటే ముందు వరుసలో చాలా మందే ఉన్నారు.

ఓ సారి అనిల్ కుంబ్లేను చూడండి. తనకంటే చిన్నవారైన వారి దగ్గర ఇంటర్వ్యూ కు హాజరయ్యి, 2 గంటల పాటు తన విజన్ ఏంటో క్లియర్ గా విడమరిచి చెప్పారు. అంతెందుకు కోచ్ ఎంపిక తర్వాత కూడా ఆయన ఇంటర్వ్యూలను చూడండి, మీ గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారో, మీరేం….బట్టలు చించుకోబడితిరి!

ఇకనైనా మీ ఆలోచనాతీరు మార్చుకోండి, టీమ్ గురించి మీకు ఉన్న నాలెడ్జ్ ను కుంబ్లే తో పంచుకోండి, జట్టు బలాలు, బలహీనతల గురించి మీకు తెలిసిన సమాచారాన్ని కుంబ్లే తో షేర్ చేసుకోండి. టీమ్ ఇండియా ఆటగాళ్లను వ్యక్తిగతంగా, టీమ్ గా, ఆటపరంగా పరిపుష్టం చేయండి. అంతేగానీ…వాళ్ళలో గ్రూప్స్ క్రియేట్ చేయకంటి.

ఆటను ప్రేమిద్దాం-దేశం గర్వించేలా చేద్దాం.

ఇట్లు.

Azzu Azharuddin.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top