ఆటలో…. నోరు జారుతున్న హర్భజన్ సింగ్ కు బహిరంగ లేఖ.!

టర్బోనేటర్…హర్భజన్ సింగ్ ( భజ్జీ) గారికి నమస్కారాలు…..

భజ్జీగారు, మీ దూస్రా బంతులకు నేను పెద్ద ఫ్యాన్ భజ్జీగారు. మిమ్మిల్ని చూశాకే..రబ్బర్ బంతితో ఆడే గల్లీ క్రికెట్ లో కూడా బాల్ ను స్పిన్ తిప్పడం స్టార్ట్ చేశా…ఇక మా శ్రవణ్ గాడైతే.. వాడు రెగ్యులర్ గా వేసే ఫాస్ట్ బౌలింగ్ ను సైతం పక్కకు పెట్టి  స్పిన్ బౌలింగ్ లోకి మారిపోయాడు కారణం…మీ బౌలింగే.! అంతేనా….! మన  బ్యాటింగ్ టాప్ ఆర్డర్ సైకిల్ స్టాండ్ లా కూలిపోతుంటే… ఇంకా మా హర్భజన్ ఉన్నాడ్రా….ఓటమి ఒప్పుకునేది లేదని గర్వంగా చెప్పుకునే వాడిని, నీ బ్యాటింగ్ స్టామినాను నమ్మి. ఆట పరంగా అంతా ఒకే…కానీ మీ ప్రవర్తనే అప్పడప్పుడు నన్ను తెగ ఇబ్బందిపెడుతుంది.

IPL లో ఆడుకుంటూ …కొత్త ఆటగాళ్లను ప్రోత్సాహించాల్సిన సమయంలో శ్రీశాంత్ చెంప మీద పల్లు మంటూ ఓ దెబ్బ వేస్తిరి.! అక్కడే నాకు చాలా బాధేసింది. ఆటలో భావోద్వేగాలు కామనే కావొచ్చు, కానీ అసలు ఆటల ముఖ్య ఉద్దేశ్యమే ఐక్యత, పరస్పర సహాకారం. వాటిని కాదని మీరలా బిహేవ్ చేయడం ఏం బాలేదు. మీకు కోపం కాసింత ఎక్కువే ఉండొచ్చు కానీ దాన్ని అదుపులో పెట్టుకుంటే బాగుండేది. 100కు పైగా వన్డేలు,200 లకు పైగా టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్న మీరు ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోవడం బాధాకరం.

DDDD

నిన్నటి మ్యాచ్ లో కూడా మీ ప్రవర్తన నాకైతే చాలా బాధ కల్గించింది. బాల్ మిస్ చేశాడని అంబటి రాయుడిని మీరు తిట్టినప్పుడు చాలా ఫీల్ అయ్యా భయ్యా…!  అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాని ప్లేయర్ మా అంబటి రాయుడు….క్రికెట్ పెద్దల రాజకీయాలకు ఆల్ రెడీ ఓ సారి బలై..మళ్లీ తన కెరీర్ ను ప్రెష్ గా స్టార్ట్ చేసిన మా హీరో అంబటి రాయుడు. భ్యాటింగ్ విషయంలో కానీ, ఫీల్డింగ్ విషయంలో కానీ చాలా పక్కగా పద్దతిగా ఉంటాడు రాయుడు… నిన్న మీ బౌలింగ్ లో బ్యాట్స్ మన్ కొట్టిన బాల్ ను అడ్డుకోడానికి కనీసం 50 అడుగుల దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక అందదని తెలిసినప్పటికీ డైవ్ చేశాడు….అయినా బాల్ ఫోర్ పోయింది. అంత మాత్రానికి అంబటి ఎఫర్ట్ ను తక్కువ చేసి..మీరు అలా నోటికొచ్చినట్టు తిట్టడం ఏం బాలేదు. ఇవన్నీ ఆటలో సహజం అని మీరు అనొచ్చు..కానీ మీ నోటి నుండి వచ్చిన పదం ఎంత ఛెండాలంగా ఉందో తెలుసా..? లాస్ట్ లో మీరు కలుసుకున్నారు అప్పుడు కాస్త సంతోషించా…కానీ ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటే బెటర్.  ఇక మీ ఇష్టం.

Watch Video : Harbhajan vs Ambati:

Comments

comments

Share this post

scroll to top