త‌ప్పు చేసి మ‌రీ త‌న‌ను తాను స‌మ‌ర్థించుకుంటున్న క‌లెక్ట‌ర్.!?

దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కును రాజ్యాంగం క‌ల్పించింది. దీని ప్ర‌కారం ఎవ‌రైనా త‌మకు ఇష్టం వచ్చిన‌ట్టుగా జీవించ‌వ‌చ్చు. అయితే అలా జీవించేట‌ప్పుడు స‌మాజంలో ఇత‌రులను మాత్రం అగౌర‌వ‌ప‌ర‌చ‌కూడ‌దు. న‌లుగురి ఎదుట అవ‌మాంచకూడ‌దు. కానీ ఆ జిల్లా క‌లెక్ట‌ర్ అదే ప‌ని చేశాడు. అంత పెద్ద చ‌దువు చ‌దువుకుని ఉండి, అంత పెద్ద హోదాలో ఉండి కూడా సాధార‌ణ మ‌హిళ‌ల‌ను అవ‌మాన ప‌రిచాడు. దీంతో ఇప్పుడీ విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.

అది మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామం. అక్క‌డ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ రాజేంద్ర బ‌హ్రుద్ ఇటీవ‌లే ప‌ర్య‌టించారు. త‌న సాధారణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ ప‌ని చేశారు. అయితే అదే స‌మయంలో అక్క‌డి ప్ర‌భుత్వంచే ఏర్పాటు చేయ‌బ‌డిన గుడ్ మార్నింగ్ స్క్వాడ్ అనే విభాగం వారు స్థానికంగా బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేస్తున్న పలువురు మ‌హిళ‌ల‌ను తీసుకుని క‌లెక్ట‌ర్ ఎదుట‌కు వ‌చ్చారు. దీంతో ఆ క‌లెక్ట‌ర్ వారిని అంద‌రి ముందూ అవ‌మాన ప‌రిచారు.

స‌ద‌రు మ‌హిళ‌ల మెడ‌లో పూల‌మాల వేసి.. చూశారా… వీరు బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేస్తున్నారు అంటూ ప్ర‌చారం చేశారు. ప‌లు మీడియా ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లు కూడా ఆ మ‌హిళ‌ల ఫొటోలు తీశాయి. దీంతో వారు చాలా అవ‌మానక‌రంగా భావించారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యం కాస్తా అంద‌రికీ తెలిసే స‌రికి స‌ద‌రు క‌లెక్ట‌ర్ చ‌ర్య‌ను వారు త‌ప్పుప‌డుతున్నారు. గ్రామీణ మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేసేందుకు స‌హాయం అందించాల్సిందిపోయి, వారిని న‌లుగురిలోనూ అవ‌మాన ప‌ర‌చ‌డం ఏంట‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే ఆ క‌లెక్ట‌ర్ మాత్రం త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకున్నారు. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చినప్పుడు స్వ‌చ్ఛ భార‌త్‌ను ప్ర‌వేశ‌పెట్టి బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేసే వారిని ఇలాగే చేయ‌మ‌ని చెప్పార‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా, అయినా స‌ద‌రు మ‌హిళ‌ల‌కు పూల‌మాల‌లు తాను వేయ‌లేద‌ని, ప్ర‌భుత్వంచే నియ‌మింప‌బ‌డిన గుడ్ మార్నింగ్ స్క్వాడ్ అనే విభాగం వారు చేశార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు క‌లెక్ట‌ర్ చేసింది త‌ప్పేన‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అవును మ‌రి, ఎంత బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న చేస్తే మాత్రం ప్ర‌తి మ‌నిషికి ఒక వ్య‌క్తిత్వం ఉంటుంది క‌దా, దానికి భంగం క‌లిగేలా వారిని అవ‌మానించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్..? మీరే చెప్పండి..! వీలైతే స్వ‌చ్చ భార‌త్, మ‌రుగుదొడ్ల వాడ‌కంపై గ్రామీణుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి, వారు మ‌రుగుదొడ్లు క‌ట్టుకునేందుకు వీలైనంత వ‌ర‌కు స‌హాయం చేయాలి. కానీ ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top