స్టీఫెన్ హౌకింగ్ శవంపై కూడా ఆ చావు నెగ్గలేకపోయింది అని ఓ అభిమాని పంపిన మెసేజ్ చూస్తే నిజమే కదా అంటారు.!

“నేను చనిపోయా” అని మనమే చెప్పలేము. ఎందుకంటే చావు మనది కాదు. మనం చనిపోయామని వేరొకరు మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజు చనిపోతామని ఏ పని చేయకుండా ఉంటే బతికున్నా చనిపోయినట్టే. మన ఆయువు ఉన్నంత వరకు చావు మనపై నెగ్గలేదు. అందుకే శవంపై గెలుపు చాటుతుంది ఆ చావు. కానీ స్టీఫెన్ హాకింగ్ సార్ విషయంలో మాత్రం..ఆ చావు శవంపై కూడా నెగ్గలేకపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఆయన కాలంలో కలిసిపోలేదు…”మరణాన్ని ఎదిరించి పోరాటం చెయ్యి” అని అందరిలో స్ఫూర్తి నింపిన శక్తిగా చిరకాలం చరిత్రలో నిలిచిపోయారు.

పుట్టడానికి చాలా కష్టపడ్డాడు స్టీఫెన్ హాకింగ్. కారణం రెండో ప్రపంచ యుద్ధం. బతికి ఉంటానో లేదో…తెలియని ఓ తల్లి అతనికి జన్మనిచ్చింది. పెరిగి స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టాడు. చదువు కంటే ఆటలే అతనికి ఎక్కువ ఇష్టం. తరగతి గదిలో కంటే మైదానంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు.

ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. అతనికి 21 సంవత్సరాల వయసు రాగానే ఓ రోగాన్ని అతనికి పరిచయం చేసింది. తద్వారా అతను మాట్లాడలేకపోయాడు. కొద్ది రోజులకి కదల్లేకపోయాడు. మరో రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతావు అని డాక్టర్లు చెప్పేసారు.

అందరిలాగా చావుకి బయపడి ఏడుస్తూ కూర్చోలేదు. రెండేళ్ల సమయం ఉంది…నేను చేయాల్సింది చాలా ఉంది అని నిశ్చయించుకున్నాడు. తనకి అనుగుణంగా ఒక ఎలక్ట్రానిక్ చైర్ తయారుచేసుకున్నాడు. మరణం అనేది లేదు..ఉన్నది ఒక్కటే జీవితం అని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడు. ప్రపంచ శాస్త్రవేత్తలకు ఒక బాటగా నిలిచాడు. ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మరెన్నో ప్రశ్నలను సంధించాడు. చావుని జయించి 75 ఏళ్లు బతికి చరిత్ర సృష్టించారు.

కొవ్వొత్తి కరుగుతూ వెలుగుని ఇచ్చినట్టు…ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయకుండా ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర తెచ్చుకున్న వ్యక్తి#Stephen Hawking. పోరాడటమే జీవితం అని నిరూపించిన మీకు హ్యాట్సాఫ్.!
#sainath gopi

"నేను చనిపోయా" అని మనమే చెప్పలేము. ఎందుకంటే చావు మనది కాదు. మనం చనిపోయామని వేరొకరు మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజు…

Posted by Sainath Gopi on Thursday, 15 March 2018

 

Comments

comments

Share this post

scroll to top