అమృత డెలివరీ వెనుక ఉన్న అసలు నిజం.. రిస్క్ చేసి మరి డెలివరీ..!!

అమృత కు ఇటీవలే బాబు జన్మించాడు, తన డెలివరీ డేట్ ఫిబ్రవరి 6 న ఇచ్చారు, కానీ అమృత పట్టుబట్టి తమ పెళ్లి రోజు అయి సంవత్సరం అవుతుంది కనుక, తన పెళ్లి రోజే డెలివరీ చెయ్యాలని డాక్టర్ లని అడిగింది, డాక్టర్ లు మొదట నిరాకరించినా, 6 రోజుల ముందు డెలివరీ చేస్తే అమృత కు ఎటువంటి సమస్య రాదని నిర్దారించుకున్నాకే ఆమెకు 6 రోజుల ముందే డెలివరీ చేసారు అని సమాచారం.

నాన్న నే నా హీరో.. :

నీ ప్రేమ ను మర్చిపోలేను, నీ ప్రేమను వెలకట్టలేను, జన్మ దిన శుభాకాంక్షలు నాన్న అని అమృత జస్టిస్ ఫర్ ప్రణయ్ పేజీ లో పోస్ట్ వేసింది, ఆ పోస్ట్ తన బిడ్డ వేస్తే ఎలా ఉంటాదో, అలా తను వేసింది. అమృత ప్రణయ్ బిడ్డ ను చుసిన నెటిజన్స్ అమృత శుభాకాంక్షలు తెలుపుతూ జాగ్రత్తగా ఆనందంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు, అమృత కు సపోర్ట్ గా ఎంతో మంది నిలిచారు.

తెలంగాణ లో జరిగిన పరువు హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అమృత ప్రణయ్ లు గత ఏడాది వివాహం చేసుకున్నారు, సరిగ్గా వాళ్లకు పెళ్లి అయి ఏడాది అయిన రోజే అమృతకు బిడ్డ పుట్టాడు. ప్రణయ్ చనిపోయే సమయానికి అమృత ఐదు నెలల గర్బిణీ. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. చనిపోయిన ప్రణయ్ పిల్లాడి రూపంలో జన్మించాడని వారు సంబరపడుతున్నారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మాట్లాడుతూ, తాను తన బిడ్డ కోసం బతుకుతానని చెప్పింది.

విమర్శలు కూడా.. :

ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావు, ఆమె బాబాయి, మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై విచారణ సాగుతోంది. మరోవైపు, ప్రణయ్ హత్య తర్వాత అమృత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మెట్టినింట్లోనే ఉంటోంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత ఆమె పట్ల సానుభూతి కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

కులాంతర వివాహమే కారణం .. :

తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు, అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన, ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అక్రమాస్తి డబ్బు వల్లే మానవత్వాన్ని మరచిపోయిన ఆయన హత్య చేయించారని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమృతరావు జైలు జీవితం గడుపుతున్నాడు.

 

Comments

comments

Share this post

scroll to top