ప్రణయ్ ఏ మళ్ళీ పుట్టాడని సంబరపడుతున్న కుటుంబ సభ్యులు.!!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది ప్రణయ్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యింది. ప్రణయ్ భార్య అమృత అప్పటికే గర్భవతి. ఇప్పుడు ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. ప్రణయ్ ఏ మళ్ళీ పుట్టాడని అమృత సంతోషంగా ఉంది, ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ప్రణయ్ ఏ మళ్ళీ పుట్టాడని ఆనందపడుతున్నారు.

అమృత, ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్ చనిపోయే సమయానికి అమృత ఐదు నెలల గర్బిణీ. ఇప్పుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. చనిపోయిన ప్రణయ్ పిల్లాడి రూపంలో జన్మించాడని వారు సంబరపడుతున్నారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మాట్లాడుతూ, తాను తన బిడ్డ కోసం బతుకుతానని చెప్పింది.

విమర్శలు కూడా.. :

ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావు, ఆమె బాబాయి, మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై విచారణ సాగుతోంది. మరోవైపు, ప్రణయ్ హత్య తర్వాత అమృత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మెట్టినింట్లోనే ఉంటోంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత ఆమె పట్ల సానుభూతి కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

కులాంతర వివాహమే కారణం .. :

తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,
అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన, ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అక్రమాస్తి డబ్బు వల్లే మానవత్వాన్ని మరచిపోయిన ఆయన హత్య చేయించారని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమృతరావు జైలు జీవితం గడుపుతున్నాడు.

గడిచిన నాలుగు నెలల్లో ఎన్నో.. :

అయితే ప్రణయ్ హత్య తరువాత అలాంటి హత్యలు చాలా ఎక్కువయ్యాయి, కులాంతర వివాహాలు చేసుకుందని కన్న కూతురిని, కూతురిని చేసుకున్న వాడిని ఇద్దరిని చంపేసిన ఘటనలు ఈ నాలుగు నెలల్లో చాలా జరిగాయి. కనుక మీరు కులాంతర లేదా మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయితే జాగ్రత్తగా ఉండండి.

Comments

comments

Share this post

scroll to top