గత ఏడాది ఇదే రోజు మన పెళ్లి జరిగింది, నీకోసం ఎంతగానో ఎదురుచూసా… ప్రణయ్ అమృత.!

సరిగ్గా ఏడాది ముందు ప్రణయ్ – అమృత ల వివాహం జరిగింది, ఈ విషయాన్ని అమృత ఫేస్బుక్ ద్వారా షేర్ చేసుకుంది, ఇటీవల తనకు బాబు పుట్టారని అసత్య ప్రచారం చేసారు ఎవరో, ఆ విషయాన్నీ ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేసింది. నాకు ఇంకా డెలివరీ అవ్వలేదు, దయ చేసి పుకార్లు పుట్టించడం ఆపేయండి అని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. ప్రణయ్ పేరు మీద జస్టిస్ ఫర్ ప్రణయ్ అని ఫేస్బుక్ లో పేజీ ఓపెన్ చేసారు ఆమె, ఆ పేజీ నుండి ఆమె సమాచారం అందిస్తూ ఉంటారు.

ఏడాది క్రితం.. :

ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు ప్రణయ్ – అమృత. ఆమె భావోద్వేగానికి లోనవుతూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ‘గత ఏడాది ఇదే రోజున నిన్ను కలుసుకునేందుకు, నీ చేతిని పట్టుకుని నడిచేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూశానని అమృత పేర్కొన్నారు. ఇప్పుడు మన చిన్నారిని ఎత్తుకునేందుకు ఎదురుచూస్తున్నానని, ఈ కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నానని, లవ్ యూ. నిన్ను చాలా మిస్ అవుతున్నానని’ అమృత జస్టిస్ ఫర్ ప్రణయ్ పేజీ లో పోస్ట్ చేశారు.

విమర్శలు కూడా.. :

ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావు, ఆమె బాబాయి, మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై విచారణ సాగుతోంది. మరోవైపు, ప్రణయ్ హత్య తర్వాత అమృత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మెట్టినింట్లోనే ఉంటోంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత ఆమె పట్ల సానుభూతి కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

కులాంతర వివాహమే కారణం .. :

తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,
అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన, ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అక్రమాస్తి డబ్బు వల్లే మానవత్వాన్ని మరచిపోయిన ఆయన హత్య చేయించారని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమృతరావు జైలు జీవితం గడుపుతున్నాడు.

గడిచిన నాలుగు నెలల్లో ఎన్నో.. :

అయితే ప్రణయ్ హత్య తరువాత అలాంటి హత్యలు చాలా ఎక్కువయ్యాయి, కులాంతర వివాహాలు చేసుకుందని కన్న కూతురిని, కూతురిని చేసుకున్న వాడిని ఇద్దరిని చంపేసిన ఘటనలు ఈ నాలుగు నెలల్లో చాలా జరిగాయి. కనుక మీరు కులాంతర లేదా మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయితే జాగ్రత్తగా ఉండండి.

facebook

ప్రణయ్‌కి అమృత శుభాకాంక్షలు

Wishing you on our anniversary… ❤It's been one year since we got married…last year it was the time I eagerly waited…

Posted by Justice for pranay on Tuesday, 29 January 2019

 

Comments

comments

Share this post

scroll to top