వెనకనుండి కౌగలించుకొని మెడపై ముద్దు పెట్టా..ఇంతలో ఓ 6 ఏళ్ల చిన్నారి మమ్మల్ని చూసి చేసిన పనికి షాక్!

”గ‌తేడాది మా ఇంట్లో ఓ ఫంక్ష‌న్ జ‌రిగింది. మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ ఒకాయ‌న ఉన్నారు. ఆయ‌న‌కు కూతురు ఉంది. ఆమె నా గ‌ర్ల్ ఫ్రెండ్. అయితే ఆయ‌న త‌న కుటుంబంతో స‌హా మా ఇంట్లో జ‌రిగిన ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. వారిలో నా గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. చాలా త‌క్కువ మందిని మాత్ర‌మే ఆ ఫంక్ష‌న్‌కు ఆహ్వానించాం. మొత్తం క‌లిపితే 60 నుంచి 70 మంది గెస్ట్‌లు అవుతారు. అయితే బ‌య‌ట ఫంక్ష‌న్ జ‌రుగుతుండ‌గా మా ఇంట్లో ఓ రూంలో మా కుటుంబ స‌భ్యులం కొంత‌మంది, నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌, నేను, కొంద‌రు గెస్ట్‌లు ఉన్నాం. అంద‌రం ముచ్చ‌ట్లు పెట్టుకున్నాం.

త‌రువాత ఒక్క‌రొక్క‌రుగా లేచి బ‌య‌ట ఫంక్ష‌న్‌లోకి వెళ్లారు. ఆ రూంలో నేను, నా గ‌ర్ల్ ఫ్రెండ్ ఇద్ద‌ర‌మే ఉన్నాం. దీంతో నేను అడ్వాంటేజ్ తీసుకున్నా. ఆమె అద్దం వైపుకు నిల‌బ‌డి ఉంది. నేను వెనుక నుంచి వెళ్లి ఆమెను కౌగిలించుకున్నా. ఆమె మెడ‌పై ముద్దు పెట్టా. అయితే ఆ స‌మ‌యంలోనే ఓ 6 ఏళ్ల చిన్నారి అటుగా వ‌చ్చాడు. మా రూం లోప‌లికి తొంగి చూస్తున్నాడు. మేం చేస్తుంది అత‌ను గ‌మ‌నించాడు. అత‌న్ని మేం అద్దంలో చూసి షాక్ అయ్యాం.

వెంట‌నే ఇద్ద‌రం విడిపోయాం. అక్క‌డి నుంచి ఆ పిల్లాడు వెళ్లిపోయాడు. త‌రువాత కొంత సేప‌టికి నా గ‌ర్ల్‌ఫ్రెండ్ కుటుంబ స‌భ్యులు, మా కుటుంబం అంద‌రం ఆరుబ‌య‌ట‌ ముచ్చ‌ట్లు పెట్టుకుంటున్నాం. అయితే అంత‌లో ఆ పిల్లాడు వ‌చ్చాడు. అత‌ను మ‌మ్మ‌ల్ని ఇద్ద‌రినీ ఎలా చూశాడో సీన్ టు సీన్ వివ‌రించి అక్క‌డ ఉన్న అంద‌రికీ చెప్ప‌సాగాడు. దీంతో నాలో టెన్ష‌న్ మొద‌లైంది. ఆ పిల్లాడు మొత్తం చెప్పే స‌రికి నేను అక్క‌డి నుంచి వెళ్లిపోయా. విప‌రీతంగా భ‌య‌ప‌డ్డా. కానీ చివ‌రికి ఏమీ కాలేదు. అంతా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే మొద‌ట్నుంచీ మా రెండు కుటుంబాలు చాలా దగ్గ‌ర‌. కానీ మాది చిన్న వ‌య‌స్సు కావ‌డంతో పెద్ద‌లు కోప‌గించుకున్నారు. ఇప్ప‌టికీ ఆ సంఘ‌ట‌నను త‌ల‌చుకుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది..!”

— ప్ర‌ణ‌య్ శ‌ర్మ అనే వ్య‌క్తికి ఎదురైన రియ‌ల్ సంఘ‌ట‌న ఇది..! రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top