అక్కడ అమ్మాయిలు జీన్స్ ధరించడం నిషేదం. సెల్ ఫోన్ లు వాడడం కూడా నిషేదం. నిషేదం ఎందుకండీ అని అడిగితే పొంతన లేని ఆన్సర్ ఇస్తారు ఆ గ్రామ పెద్దలు. జీన్స్‌లు ధరించడం, ఫోన్లు వాడడం వల్లే ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయట అందుకే వాటిని వినియోగించడం పై నిషేదం విధించాము అంటున్నారు ఆ గ్రామ పంచాయితీ పెద్దలు. అంతే కాదు తమ ఊరిలోకి వచ్చే వారికి కూడా ఈ నింబంధన వర్తిస్తుందని తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ జిల్లాల్లోని పది గ్రామాల్లో పెళ్లి కాని బాలికలు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్స్ ధరించకూడదని, మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసారు. వీటి కారణంగానే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిని నిషేదిస్తే అవి తగ్గుతాయని ఆ గ్రామ పంచాయితీ ఈ నిర్ణయం తీసుకుందంట!గ్రామ పంచాయితీ తీసుకున్న నిర్ణయం పై ఎవరికైనా డౌట్లు ఉంటే వారిని కలవొచ్చని, కలిసిన వారికి కౌన్సెలింగ్ ఇస్తామని కూడా ప్రకటించారు ఆ గ్రామ పంచాయితీ పెద్దలు.