తాగిన మత్తులో అమ్మాయిని లైంగికంగా వేధించిన నలుగురు కుర్రాళ్ళకు కోర్టు విధించిన శిక్షేంటో తెలుసా?

ఇష్టం వచ్చినట్లు మద్యం సేవించి, ఒక యువతిని నడిరోడ్ పై వేధించారు నలుగురు యువకులు. బాబూ ఇలా చేయడం తప్పంటూ అడ్డొచ్చిన వ్యక్తిని నువ్వెవడివిరా మాకు చెప్పడానికి అంటూ అతడ్ని ఇనుప రాడ్లతో కొట్టారు. కట్ చేస్తే  ఆ నలుగురిని  ముంబై వీధులు, రోడ్లు ఆరునెలల పాటు శుభ్రం చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.  అసలు విషయంలోకి వస్తే…..

ఒక వ్యక్తి  ఉదయం గం.11ల సమయంలో ముంబైలోని థానే రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుండగా, గుంపులు గుంపులుగా జనం, పోలీసులు ఉన్నారు. ఏం జరిగిందా? అని చూడటానికి వెళ్ళాడు. నలుగురు యువకులు రోడ్లను చీపుర్లు పట్టుకొని క్లీన్ చేస్తున్నారు. అరె..గ్రేట్ కదా అన్నాడు.  అక్కడున్న మరో వ్యక్తి జరిగిన విషయం తెలిస్తే వాళ్ళను కసితీరా కొడతావు అన్నాడు. అంతపెద్ద తప్పు వాళ్ళేం చేసుంటారు అని ఆలోచిస్తుండగా..
625062406
గత సంవత్సరం దసరా వేడుకల సందర్భంగా ముంబైలో నివాసముంటున్న నలుగురు కుర్రాళ్ళు అంకిత్ జాదవ్, మిలింద్ మోర్, సుహాస్ టాగూర్,అమిత్ లు ఫుల్లుగా మద్యం సేవించి రోడ్లపై ఇష్టంవచ్చినట్లుగా హల్చల్ చేస్తున్నారు. ఒంటరిగా కనిపించిన ఒక యువతిని లైంగికంగా వేధించారు. ఆ యువతిని వేధిస్తుంటే పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకుంటుండగా, అతడిని ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇంకెవరైనా ముందుకు వస్తారా అని బెదిరించారు. బాధితులు కేసు నమోదు చేయడంతో కేసు కోర్టుకెళ్ళింది. అయితే తమ పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వారి పేరెంట్స్, ఆ నలుగురు కుర్రాళ్ళు క్షమించమని వేడుకుంటూ కోర్టు బయటే మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు.కోర్టులో కేసు ఫైల్ కావడంతో తమపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి వెళ్ళగా, న్యాయస్థానం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కేసును పరిశీలించిన న్యాయాధికారి ఆరు నెలల పాటు ముంబైలోని రోడ్లను పోలీసుల సమక్షంలో క్లీన్ చేయాలని, అలాగే ఒక్కొక్కరు టాటా మెమోరియల్ హాస్పిటల్ కు రూ.5000 ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా ఈ మధ్యే ఇలా రోడ్లను పోలీసుల సమక్షంలో  శుభ్రం చేస్తున్నారు అతడు చెప్పాడు. మూడురోజుల క్రితం ఇలా ఏడు గంటలపాటు ఆ నలుగురు యువకులు ముంబై వీధులను శుభ్రం చేశారు.
865369167
అయితే ఈ శిక్షను అనుభవిస్తున్న ఆ యువకులలో ఒకతను ” మేం చాలా పెద్ద తప్పు చేశాం…అందరికీ ఇది ఓ గుణపాఠంగా ఉండాలని అన్నాడు ,మేం చేసిన పనికి సిగ్గుతో చింతిస్తున్నామని చాలా ఫీల్ అవుతున్నారు ఆ కుర్రాళ్ళు.

Comments

comments

Share this post

scroll to top