గుడికెళ్లిన భక్తులు అమ్మవారి విగ్రహం చూసి షాక్..! చీరకి బదులు చుడీదార్ తో అమ్మవారికి అలంకరణ.?

ఒకప్పుడు స్త్రీలు చీరలు,లంగా జాకెట్టు,లంగా వొణి కట్టుకునేవారు..తర్వాత చుడీదార్లొచ్చాయి..ఆ తర్వాత ఫ్యాంట్ షర్ట్ లు అంటూ రకరకాల ఫ్యాషన్లొచ్చాయి..మానవులకేనా ఫ్యాషన్లు దేవతలకు అక్కర్లేదనుకున్నారో ఏమో కానీ..ఎప్పుడూ చీరల్లో ముస్తాబు చేసే అమ్మవారు పంజాబి డ్రెస్ ఎందుకు వేసుకోకూడదు అనుకుని అదే విధంగా అలకరించారు..ఆ విధంగా అలంకరించిన పూజారులు సస్పెండ్ అయ్యారు..అసలింతకీ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..

కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.పట్టువస్త్రాలతో,నగలతో అందంగా ముస్తాబైన దేవతామూర్తులను కనులారా దర్శించి..భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటాం..కానీ తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారిని దర్శించిన భక్తులు దేవతను చూసాకా ఆశ్చర్య పోయారు. మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు పూజారులు.

ఆలయంలో తండ్రికి సాయంగా చేరిన రాజ్ అనే పూజారి  అమ్మవారికి  పింక్ కమీజ్, బ్లూ సల్వార్,బ్లూ దుపట్టా తొడిగి,నగలతో అలంకరించాడు.దీన్ని అతడి తండ్రి తప్పుపట్టలేదు.అలంకరణ పూర్తైన తర్వాత అమ్మవారి ఫోటో తీసి వాట్సప్ చేశాడు.అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది.ఈలోపు గుడికొచ్చిన భక్తులు ఆగ్రహంతో ఊగిపోగా..మరోవైపు నిర్వాహకులవరకూ వీరి నిర్వాకం వెళ్లి   రాజ్, కల్యాణం అనే ఇద్దరు పూజారులను సస్పెండ్ చేశారు.క్రియేటివిటి ముఖ్యమే కానీ..మరీ ఇంత క్రియేటివిటీ తట్టుకోవడం మహాకష్టంరా బాబూ..

Comments

comments

Share this post

scroll to top