అమ్మ పాట అంటే ఇలా ఉండాలి.. పాట వింటుంటే గుండె కరిగి కంటి నుండి ఉబికింది.

సృష్టిలో తియ్యని మాట అమ్మా.. ఈ పాట వింటే అంతకంటే ఎక్కువే అనిపిస్తుంది. అంతే కాదు ఈ పాట వింటుంటే మన ప్రమేయం లేకుండానే మన కంటినుండి అశ్రువులు  అమ్మ  జ్ఞాపకాల్లా  మన బుగ్గను నిమురుతాయ్. అమ్మ కొడకా… అంటూ ఆకునూరి దేవ‌య్య పాడిన ఈ పాట మ‌న‌సును పిండేసింది. అమ్మ‌… పేగు తెగుతున్న బాధ‌ను పంటి బిగువున భ‌రించి మ‌న‌కు కొత్త లోకాన్ని ప‌రిచ‌యం చేస్తుంది. క‌డుపులో ఉండి త‌న్నినా అవి గిలిగింత‌లుగా భావించి చిరున‌వ్వులు చిందిస్తోంది.

మ‌న‌కోసం ప్రాణాలే ఫణంగా పెట్టిన అమ్మ ఈరోజు రోడ్ల మీద అడుక్కుతింటుంది. ఆనాథాశ్రమాల్లో ఉంటూ  నావాళ్లు ఎక్కడా అంటూ వెతుక్కుంటుంది. నువ్వు ఆక‌లంటే త‌న క‌డుపు మాడ్చుకుని మ‌న క‌డుపు నింపిన అమ్మ ఈ రోజు ఆక‌లితో చ‌స్తుంది. మిత్రులారా…. అమ్మంటే కేవ‌లం మ‌నిషి కాదు. దేవ‌త‌… అంత‌కంటే ఎక్కువ‌… అమ్మ‌ను ప్రేమించండి. ఆస్తుల కోసం, ఆలి కోసం అమ్మ‌ను దూరం చేసుకోకండి. ఇప్పుడు ఈ పాట వినండి.

Watch Video (Wait 3 Sec For  Video Bufeering):

కన్నీళ్లు తెప్పించాడు…..

Comments

comments

Share this post

0 Replies to “అమ్మ పాట అంటే ఇలా ఉండాలి.. పాట వింటుంటే గుండె కరిగి కంటి నుండి ఉబికింది.”

  1. J S N MURTHY says:

    VERY GOOD TO SEE AND READ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top