అమ్మ చనిపోయినప్పుడు ఆ ఇద్దరే నాకు తోడుగా ఉన్నారు – శ్రీ దేవి గారి కూతురు జాహ్నవి కపూర్!!

శ్రీ దేవి గారి మరణం ఆమె కుటుంబ సభ్యులను ఎం తో బాధకు గురిచేసింది,మాటల్లో వర్ణించలేనంత బాధకు లోనయ్యారు ఆమె కుటుంబ సభ్యులు, శ్రీ దేవి గారికి ఇద్దరు కుమార్తెలు. జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్. శ్రీ దేవి గారి మరణం తరువాత జాహ్నవి కపూర్ తనకు ఎదురైనా అనుభవాల గురుంచి చెప్పారు :

ఏ పని చేసినా అమ్మ గుర్తుకొస్తుంది :

అమ్మ మరణించాక నాకు ఏం అర్ధం కాలేదు, ఆ షాక్ నుండి ఇంకా బయటికిరాలేదు. నేను ఇప్పటికి నమ్మలేకున్నా, ఏ పని చేసినా అమ్మ నే గుర్తుకువస్తాది నాకు, ప్రతి రోజు బాధ పడుతూనే ఉంటా అమ్మ ను తలుచుకుంటూ. అమ్మ మరణించాక నేను హర్ష భయ్య(అనిల్ కపూర్ కుమారుడు) ఒక రూములో కూర్చున్నపుడు అర్జున్ భయ్యా, అన్షులా దీదీ వచ్చారు. అప్పుడు వారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ నాటి వరకు వారిద్దరూ నాకు తోడుగా ఉన్నారు, నన్ను నా చెల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. కష్ట సమయం లో తోడుగా అండగా నిలబడ్డారు, మా రక్తం లో ప్రవహించేది ఒకటే రక్తం. అర్జున్ అన్న, అన్షులా అక్క మాతో ఉన్నంత వరకు మాకు ఎటువంటి భయం లేదు.

అర్జున్, అన్షులా, బోణి కపూర్ మొదటి భార్య పిల్లలు. అర్జున్, అన్షులా శ్రీదేవి గారి పిల్లలతో పెద్దగా కలిసేవారు కాదు. కానీ శ్రీదేవి గారి మరణం తరువాత, ఆ ఇద్దరు శ్రీ దేవి గారి పిల్లలకు అండగా నిలబడ్డారు. జాహ్నవి కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తుంది. అక్క చెల్లెల్లు ఇద్దరు శ్రీదేవి గారి పేరు నిలబెడతారు అని అందరు ఆశిస్తున్నారు.

జాహ్నవి కపూర్ నటించిన ధఢక్ సినిమా గతేడాది విడుదల అయ్యింది, మొదటి చిత్రమే అయినా తన నటనతో అందం తో కుర్రకారుని ఆకట్టుకుంది జాహ్నవి కపూర్. ప్రస్తుతం జాహ్నవి కపూర్ ‘తక్త్’, ‘రణ్ భూమి’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2020 విడుదల కానున్నాయి.

 

Comments

comments

Share this post

scroll to top